హైదరాబాద్ లో విషాదం... వంటగదిలో తల్లి, బెడ్రూంలో కూతురు సూసైడ్

Published : Jun 23, 2023, 05:32 PM IST
హైదరాబాద్ లో విషాదం... వంటగదిలో తల్లి, బెడ్రూంలో కూతురు సూసైడ్

సారాంశం

వంటగదిలో తల్లి, బెడ్రూంలో కూతురు ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ మణికొండలో చోటుచేసుకుంది. 

హైదరాబాద్ : భర్తను యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవాలయానికి పంపించి తల్లీకూతురు ఆత్మహత్య చేసుకున్నారు. ఇంట్లో ఎవరూ లేకుండా చేసి తల్లి ఓ గదిలో, కూతురు మరో గదిలో సూసైడ్ చేసుకున్నారు. ఈ విషాద ఘటన హైదరాబాద్ రాయదుర్గంలో చోటుచేసుకుంది.  

పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్ మణికొండ ప్రాంతంలోని ఆంధ్రా కాలనీలో అలివేలు భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి నివాసముంటోంది. అయితే హటాత్తుగా ఏమయ్యిందో తెలీదుగానీ గురువారం సాయంత్రం భర్తను యాదాద్రికి వెళ్లాలని పంపించింది. దీంతో భార్య దగ్గరే రూ.5వేలు తీసుకుని అతడు లక్ష్మీనరసింహస్వామిన దర్శించుకోడానికి వెళ్ళాడు. 

అయితే గురువారం సాయంత్రం భర్త వెళ్ళిపోగానే  ఇంట్లోని పాత దుస్తులను తగలేసింది అలివేలు. ఎందుకోసం ఇలా చేస్తున్నావని కొడుకు అడిగినా సమాధానం చెప్పలేదు అలివేలు. ఇవాళ(శుక్రవారం)తెల్లవారుజామున అలివేలు కొడుకు తల్లీ వంటగదిలో, సోదరి లాస్య బెడ్రూంలో చనిపోయి కనిపించారు. దీంతో అతడు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే రాయదుర్గం పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. తల్లీకూతురు ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి వుంది. 

(జీవితంలోని ప్రతి సమస్యకు చావు ఒక్కటే పరిష్కారం కాదు. జీవితంలో మీకెప్పుడైనా మానసిక ఒత్తిడితో బాధపడుతూ సహాయం కావాలనిపిస్తే వెంటనే ఆసరా హెల్ప్ లైన్ ( +91-9820466726 )  కి కాల్ చేయండి లేదా ప్రభుత్వ హెల్ప్ లైన్ కి కాల్ చేయండి. జీవితం చాలా విలువైనది.)

PREV
click me!

Recommended Stories

ఫ్యూచర్ సిటీ భవనాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి CM Revanth Reddy Inaugurates Future City
CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్| Asianet Telugu