విద్యుత్ సౌధ వద్ద తీవ్ర ఉద్రిక్తత: చివరకు కాంగ్రెస్‌ నేతలను లోనికి అనుమతించిన పోలీసులు..

Published : Apr 07, 2022, 02:02 PM IST
విద్యుత్ సౌధ వద్ద తీవ్ర ఉద్రిక్తత: చివరకు కాంగ్రెస్‌ నేతలను లోనికి అనుమతించిన పోలీసులు..

సారాంశం

విద్యుత్ చార్జీల పెంపుకు నిరసనగా విద్యుత్ సౌధ ముట్టడికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు విద్యుత్ సౌధ వద్దకు చేరుకున్నారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.   

తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ చార్జీల పెంపుకు, దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు విద్యుత్ సౌధ వద్దకు చేరుకున్నారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసకుంది. విద్యుత్ సౌధ వద్ద ఏర్పాటు చేసిన బారికేడ్లను దాటుకుని ముందుకు వెళ్లేందుకు రేవంత్ రెడ్డి యత్నించారు. 

ఈ క్రమంలోనే విద్యుత్ సౌధ ముందు కాంగ్రెస్ ఆందోళన చేపట్టింది. రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టాయి. పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించాలని పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు నినాదాలు చేశారు. ఈ ఆందోళనలో సీనియర్ నాయకులు రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, జీవన్ రెడ్డి, మధుయాష్కి, మల్లు రవి పాల్గొన్నారు. 

దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. కొద్దిసేపటికి కొందరు కాంగ్రెస్ నాయకులు విద్యుత్ సౌధలోకి వెళ్లేందుకు పోలీసులు అనుమతించారు. దీంతో రేవంత్ రెడ్డి, శ్రీధర్ బాబు, భట్టివిక్రమార్క, మధుయాష్కి విద్యుత్ సౌధలోనికి వెళ్లారు. అక్కడ విద్యుత్ చార్జీలను తగ్గించాలని కోరుతూ అధికారులకు కాంగ్రెస్ నేతలు వినతి పత్రం అందజేయనున్నారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Telangana Rising Global Summit : తొలి రోజు రూ.1.88 లక్షల కోట్ల పెట్టుబడులు.. వేల ఉద్యోగాలు
Telangana Rising గ్లోబల్ సమ్మిట్ తో కలిగే మార్పులు, లాభాలు ఏమిటి?