వరంగల్ సెంటిమెంట్ కాంగ్రెస్ పార్టీకి వర్కౌవుట్ కానుందా లేదా అనేది భవిష్యత్తు నిర్ణయించనుంది. అయితే గతంలో వరంగల్ సభ సక్సెస్ కావడంతో పాటు 2004లో ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కారణమైందని ఆ పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు.
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ Warangal సెంటిమెంట్ వర్కౌవుట్ కానుందా అనే విషయం భవిష్యత్తు నిర్ణయించనుంది. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో 2002లో వరంగల్ లో నిర్వహించిన సోనియా గాంధీ సభ విజయవంతమైంది.ఈ సభ తర్వాత YS Rajasekhara Reddy పాదయాత్రను ప్రారంభించారు. 2004లో ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో Congress అధికారంలోకి వచ్చింది.
2023 ఎన్నికల్లో Telangana రాస్ట్రంలో అధికాారంలోకి రావాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తుంది. ఈ మేరకు రైతు సమస్యలపై తీసుకొని ఇవాళ వరంగల్ లో సభను ఏర్పాటు చేశారు. ఈ సభ విజయవంతం చేసి ప్రత్యర్ధులకు సవాల్ విసరాలని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ప్లాన్ చేసింది. ఈ సభకు జన సమీకరణను కూడా పార్టీ నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకు రావడానికి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం సన్నాహాలు చేసుకొంటుంది. ఇప్పటికే ఎన్నికల వ్యూహాకర్తగా Sunil ను ఆ పార్టీ నియమించుకుంది.
సునీల్ ఇచ్చిన సూచనలు,సలహాలతో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం రాష్ట్రంలో అడుగులు వేస్తుంది. వరంగల్ సభలో కూడా సునీల్ కూడా ఈ సభకు వచ్చారు. ఈ సభలో ప్రస్తావించాల్సిన అంశాలపై కూడా సునీల్ పార్టీ నేతలతో చర్చించారు.
ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో వరంగల్ లో నిర్వహించిన సభకు భారీ ఎత్తున జనం హాజరయ్యారు.ఆ సమయంలో ఈ సభకు 5 లక్షల మంది హాజరయ్యారని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య గుర్తు చేశారు. వరంగల్ సభ కాంగ్రెస్ పార్టీలో నూతన ఉత్సాహన్ని నింపే అవకాశం ఉందని ఆ పార్టీ నాయకత్వం భావిస్తుంది. గతంలో వరంగల్ సభలో సోనియాగాంధీ పాల్గొన్నారు. తెలంగాణలో వరంగల్ లో నిర్వహించే సభలో రాహుల్ గాంధీ పాల్గొంటున్నారు.
గతంలో కూడా ఉమ్మడి ఏపీ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచింది. 1980 లో Indira Gandhi ని మెదక్ నుండి ఎంపీగా గెలిపించారు ప్రజలు. 2 లక్షల ఓట్ల మెజారిటీతో ఇందిరా గాంధీ ఈ ఎన్నికల్లో విజయం సాధించారు. 2004, 2009లలో కేంద్రంలో యూపీఏ ప్రభుత్వ ఏర్పాటులో ఉమ్మడి ఏపీ రాష్ట్రం కీలక పాత్ర పోషించింది. ఉమ్మడి ఏపీ రాష్ట్రం నుండి కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు విజయం సాధించడంతో యూపీఏ ప్రభుత్వం ఏర్పాటైంది.
రాహుల్ గాంధీ రెండు రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ రెండు రోజుల టూర్ లో పార్టీ బలోపేతం చేయడంపై కూడా రాహుల్ కేంద్రీకరించనున్నారు.పార్టీని నష్టపోయి కూడా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలో భాగంగా తెలంగాణ ఇచ్చిన విషయాన్ని కూడా ఆ పార్టీ నేతలు ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయనున్నారు. అంతేకాదు టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఇచ్చిన హామీలపై ఏం చేశారనే దానిపై కూడా ప్రజల్లో చర్చకు పెట్టనున్నారు కాంగ్రెస్ నేతలు. తెలంగాణలో ఎన్నికలు జరిగే సమయానికి వీలైననీ ఎక్కువ సభలు నిర్వహించాలని కూడా ఆ పార్టీ నాయకత్వం తలపెట్టింది.
గత మాసంలో పార్టీ అగ్ర నేతలతో రాహుల్ న్యూఢిల్లీలో భేటీ అయ్యారు. తమ మధ్య విబేధాలను పక్కన పెట్టి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు పని చేయాలని రాహుల్ సూచించారు. ఈ సమావేశం తర్వాత పార్టీ నేతలు పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు పని చేస్తున్నారు.