
హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో TRS గద్దె దిగక తప్పదని టీపీసీసీ చీప్ Revanth Reddy జోస్యం చెప్పారు. ప్రజాస్వామ్యబద్దంగా ప్రభుత్వం వ్యవహరించాలని ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి కోరారు. శుక్రవారం నాడు ఆయన శంషాబాద్ ఎయిర్‌పోర్టు వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు.ఓయూలో విద్యార్ధులతో ముఖాముఖికి, చంచల్ గూడ జైల్లో ఎన్ఎస్‌యూఐ నేతల ములాఖత్ కి రాహుల్ కి అనుమతివ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం శునకానందం పొందుతుందని విమర్శలు చేశారు.
రాహుల్ గాంధీ Osmania university కి వస్తే ఇక్కడ ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తారన్నారు. Warangal డిక్లరేషన్ ద్వారా రైతులకు భరోసా ఇవ్వనున్నట్టుగా రేవంత్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణలో తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామో కూడా ఈ సభ ద్వారా చెబుతామన్నారు.
టీఆర్ఎస్ నేతలపై భగ్గుమన్న భట్టి
ఏ ముఖం పెట్టుకొని రాహుల్ గాంధీ తెలంగాణకు వస్తున్నారని టీఆర్ఎస్ నేతలు ప్రశ్నించడాన్ని సీఎల్పీ నేత Mallu Bhatti Vikramarka తప్పు బట్టారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం రోడ్డుపై కూర్చుని నాలుగు మాటలు మాట్లాడితే సరిపోదన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పార్లమెంట్ లో బిల్లు పెట్టి పాస్ చేయించింది కాంగ్రెస్ పార్టీయేనని భట్టి విక్రమార్క గుర్తు చేశారు. ఓయూలో రాహుల్ గాంధీ సమావేశం కోసం చివరి నిమిషం వరకు పోరాటం చేస్తామని ఆయన ప్రకటించారు.