ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల కోసమే డ్రామాలు.. కాంగ్రెస్ సరే, తెలంగాణకు మీరేం చేశారు: మోడీకి తలసాని కౌంటర్

Siva Kodati |  
Published : Feb 08, 2022, 03:51 PM ISTUpdated : Feb 08, 2022, 04:44 PM IST
ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల కోసమే డ్రామాలు.. కాంగ్రెస్ సరే, తెలంగాణకు మీరేం చేశారు: మోడీకి తలసాని కౌంటర్

సారాంశం

ప్రధాని నరేంద్ర మోడీకి తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణకు బీజేపీ (bjp) ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఏడేళ్లవుతున్నా విభజన హామీలు నెరవేర్చలేదని తలసాని ఆగ్రహం వ్యక్తం చేశారు

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఉద్దేశిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ (narendra modi) చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (talasani srinivas yadav).. ప్రధాని మోడీపై మండిపడ్డారు. తెలంగాణకు బీజేపీ (bjp) ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఏడేళ్లవుతున్నా విభజన హామీలు నెరవేర్చలేదని తలసాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు గుణపాఠం చెబుతారని తలసాని శ్రీనివాస్ యాదవ్ జోస్యం చెప్పారు. 

ప్రధాని డ్రామాల్లో ఆరితేరిన వ్యక్తని.. పార్లమెంట్‌కు రాడంటూ తలసాని మండిపడ్డారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నాయని డ్రామాలు స్టార్ట్ చేశారని.. కాంగ్రెస్ అన్యాయం చేస్తే నువ్వు ఏం న్యాయం చేసావో చెప్పాలంటూ మంత్రి డిమాండ్ చేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో బీజేపీ ఓడిపోతుందని.. అఖిలేష్ యాదవ్ సీఎం అవుతారని తలసాని జోస్యం చెప్పారు. హైదరాబాద్ లో జరిగిన ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని మోడీ తన స్వార్థానికి ఉపయోగించుకున్నారని మంత్రి ఆరోపించారు. సమతామూర్తి కార్యక్రమాల్లో పాల్గొనే నైతిక హక్కు ప్రధానికి లేదని.. బీజేపీ సిద్ధాంతమే విభజించు, పాలించు అన్న తలసాని.. మనుషులను కులాలు, మతాల పేరుతో విభజించారని దుయ్యబట్టారు. 

ప్రధానికి బాధ్యత ఉండాలని.. యూపీ ఎన్నికల గురించే ధార్మిక కార్యక్రమంలో మాట్లాడారని శ్రీనివాస్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ మీద మోడీకి ఎంత కక్ష్య ఉందో ఆయన మాటలతోనే తెలుస్తోందని.. కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేయకముందే 7 మండలాలు లాక్కుని ఆంధ్రలో కలిపాడని తలసాని గుర్తుచేశారు. తెలంగాణలో ఉన్న ఆస్తులు అమ్మేస్తున్నారని.. సింగరేణి వంటి పెద్ద సంస్థలు కూడా అమ్మేస్తున్నారని మండిపడ్డారు. ఏడున్నర సంవత్సరాల్లో ఆయన ఆయన డ్రెస్ కోడ్ తప్ప దేశ ప్రజలకు ఏమి చేయలేదని.. సింగరేణి జోలికి వస్తే తెలంగాణ ఉద్యమం తరహా ఉద్యమం మళ్ళీ మొదలవుతుందని శ్రీనివాస్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రధాని పర్యటన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒకరు ప్రతినిధిగా ఉంటే సరిపోతుందని.. ప్రధాని పర్యటనను బాయ్‌కాట్ చేస్తే తప్పేంటని తలసాని ప్రశ్నించారు. రాష్ట్రం అడిగిన ఒక్క పని కేంద్రం చేయలేదని..దానికి సమాధానం చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. రాజ్యాంగం పై ప్రతిపక్షాలు కుక్కరుపులు అరుస్తున్నాయని.. 105 సార్లు రాజ్యాంగం సవరణలు చేశారని, మళ్ళీ సవరణలు చేయాలని డిమాండ్ చేస్తున్నామని ఆయన చెప్పారు. చావుల మీద పేలాలు ఏరుకునే పార్టీలని.. రాజ్యాంగం ప్రకారం విభజన జరిగిందని, మరి విభజన చట్టంలోని హామీలు అమలు చేయాలని తలసాని డిమాండ్ చేశారు. 

బీజేపీలో ఉన్నది నెహ్రూ జూలాజికల్ పార్కులో ఉన్నవి ఒక్కటేనని.. పొలిటికల్ డ్రామాలో భాగంగానే రాష్ట్ర విభజన పై మోడీ మాట్లాడారని తలసాని ఆరోపించారు. పార్లమెంటులో ఏ ఏంపీ ప్రశ్నించక ముందే ప్రధాని ఏపీ విభజన అంశాన్ని లేవనెత్తారని.. దేశ రాజకీయాల్లో భారీ మార్పులు రాబోతున్నాయని శ్రీనివాస్ యాదవ్ జోస్యం చెప్పారు. 

అంతకుముందు మంత్రి హరీశ్  రావు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై మోడీ ఎంత వ్యతిరేకమో ఆయన మాటలు చెబుతున్నాయని మండిపడ్డారు. ఈ రోజు ఆయన అక్కసునంతా వెళ్లగక్కారని.. దీనిని తెలంగాణ ప్రజలు గమనించాలన్నారు. మోడీ , బీజేపీ నేతలు ఈరోజు తెలంగాణకు వ్యతిరేకంగా వున్నారని.. రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని హరీశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడిప్పుడే తెలంగాణ ఒడ్డున పడుతోందని మంత్రి చెప్పారు.

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Cold wave: హైదరాబాదా లేదా క‌శ్మీరా? దారుణంగా పడిపోతున్న టెంపరేచర్, వచ్చే 3 రోజులూ ఇంతే
Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు