Metro Expansion Plan: హైదరాబాద్‌ను అన్ని దిశల్లో అభివృద్ధి చేసేందుకు వీలుగా ప్రస్తుతం ఉన్న ఐదు మెట్రో కారిడార్లను సమీప ప్రాంతాలకు విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని , గత ప్రభుత్వం ప్రతిపాదించిన రాయదుర్గం-విమానాశ్రయ మార్గ నిర్మాణాన్ని నిలిపివేయాలన్నారు. ఈ మార్గానికి బదులుగా విమానాశ్రయ మెట్రోను ఎంజీబీఎస్ వయా ఓల్డ్ సిటీ తోపాటు ఎల్బీనగర్ కనెక్ట్ చేయాలన్నారు. హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ కమిషనర్‌తో సమన్వయం చేసుకుంటూ కొత్త ప్రతిపాదనలు తయారుచేయాలన్నారు.
Metro Expansion Plan: హైదరాబాద్‌ను అన్ని దిశల్లో అభివృద్ధి చేసేందుకు వీలుగా ప్రస్తుతం ఉన్న ఐదు మెట్రో కారిడార్లను సమీప ప్రాంతాలకు విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని హెచ్‌ఎంఆర్‌ఎల్ అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. నగరం పరిధిలో ఎక్కువ ప్రాంతాలకు ఉపయోగపడేలా ప్రయాణికులకు సేవలందించేలా మెట్రోరైలు మార్గాలను విస్తరించాలని సీఎం సూచించారు. గతంలో బీఆర్ఎస్ సర్కార్ ప్రతిపాదించిన రాయదుర్గం విమానాశ్రయానికి మార్గ నిర్మాణాన్ని నిలిపివేయాలన్నారు.
ఈ మార్గంలో ప్రయాణానికి ఇబ్బందులు లేకుండా అవుటర్ రింగ్ రోడ్డు ఉందన్నారు. ఈ మార్గానికి బదులుగా అలైన్‌మెంట్‌లో మార్పుతో ఎంజీబీఎస్ వయా ఓల్డ్ సిటీ తోపాటు ఎల్బీనగర్ కనెక్ట్ చేయాలన్నారు. ఈ అలైన్‌మెంట్ కోసం వివరణాత్మక ప్రాజెక్ట్ నివేదికలను (DPR) సిద్ధం చేయడానికి సూచనలు జారీ చేశారు. హైదరాబాద్ మెట్రోరైలు రెండో, మూడోదశ విస్తరణపై ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి మంగళవారం సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఇచ్చిన పవర్‌పాయింట్ ప్రజంటేషన్‌ను పరిశీలించారు.
కొత్త అలైన్‌మెంట్‌లో లక్ష్మీగూడ - జల్‌పల్లి - మామిడిపల్లి మధ్య మెట్రోలో కొంత భాగాన్ని 'అట్ గ్రేడ్' (రోడ్ లెవెల్) వేయడానికి సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని హెచ్‌ఎంఆర్‌ఎల్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్‌విఎస్ రెడ్డిని ముఖ్యమంత్రి కోరారు. ఇప్పటికే 40 అడుగుల వెడల్పుతో ఎలాంటి అడ్డంకులు లేకుండా సెంట్రల్ మీడియన్‌ను సిద్ధంగా ఉంచామని, దీనివల్ల నిర్మాణ వ్యయం తగ్గుతుందని చెప్పారు. ట్రాన్సిట్ ఓరియెంటెడ్ డెవలప్‌మెంట్‌ను చేపట్టేందుకు ఈ మార్గంలో అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించాలని ఎంఏయూడీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం దానకిషోర్, ముఖ్యమంత్రి కార్యాలయ ప్రిన్సిపల్ సెక్రటరీ వీ శేషాద్రిలను ఆదేశించారు.
ఓల్డ్ సిటీ అభివృద్ధిని ప్రోత్సహించడంతో పాటు ఎయిర్‌పోర్ట్ మెట్రో ప్రాజెక్ట్‌కు కొంత నిధులను అందించడంలో ఇది సహాయపడుతుందని తెలిపారు. కొత్త అలైన్‌మెంట్ దూరాన్ని తగ్గిస్తుందనీ, నగరంలోని అనేక ప్రాంతాలకు అందించడమే కాకుండా ఖర్చును తగ్గించడంలో సహాయపడుతుందని సీఎం పేర్కొన్నారు. హెచ్‌ఎంఆర్‌ఎల్ ఎండి వివరణాత్మక ప్రజెంటేషన్ తర్వాత, మెట్రో విస్తరణ ప్రతిపాదనలు నగరంలోని ప్రధాన ప్రాంతాలకు అనుగుణంగా ఉండాలని, గరిష్ట ప్రయాణికులకు సేవలు అందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. కొత్తగా ఎల్బీనగర్-హయత్‌నగర్, మియాపూర్-పటాన్‌చెరు, రాయదుర్గం- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఎంజీబీఎస్- విమానాశ్రయ ప్రతిపాదనలను సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు.
పాతబస్తీ మెట్రో కోసం దారుల్‌షిఫా జంక్షన్ నుంచి శాలిబండ జంక్షన్ వరకు రోడ్డును విస్తరించాలన్న హెచ్‌ఎంఆర్‌ఎల్ ప్రతిపాదనలకు సంబంధించి, పాత ప్రజాప్రతినిధులతో సంప్రదించి దారుల్‌షిఫా జంక్షన్ నుంచి ఫలక్‌నుమా జంక్షన్ వరకు 100 అడుగుల వరకు రోడ్డు విస్తరణ సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి కోరారు. అలాగే.. రోడ్డు విస్తరణ, మెట్రో రైలు ప్రణాళిక సమయంలో పాతబస్తీలో గుర్తించిన 103 మత, వారసత్వ, ఇతర సున్నితమైన కట్టడాలపై ఎలాంటి ప్రభావం పడకూడదని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.
ప్రస్తుతం ఉన్న ఐదు మెట్రో కారిడార్లను సమీపంలోని గమ్యస్థానాలకు విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని హెచ్‌ఎంఆర్‌ఎల్ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. హెచ్‌ఎంఆర్‌ఎల్ ఎండీ, హెచ్‌ఎండీఏ కమిషనర్‌లు కూడా వీలైనంత త్వరగా ఈ ప్రణాళికలను సిద్ధం చేయాలని, మరికొద్ది రోజుల్లో కేంద్ర పట్టణాభివృద్ధి, గృహనిర్మాణ శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీకి లేఖ రాయాలని ఆదేశించారు.
ORR వెంట వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ , గ్రోత్ హబ్‌ల అవసరాలను తీర్చడానికి సమగ్ర మాస్టర్ ప్లాన్‌ను సిద్ధం చేయాలని సమావేశంలో పాల్గొన్న సీనియర్ అధికారులను ఆదేశించారు . అలాగే.. విమానాశ్రయం నుండి శ్రీశైలం హైవేపై కందుకూరు వరకు మెట్రో రైలు కనెక్టివిటీని కూడా ప్లాన్ చేయాలి. ఫార్మా సిటీ కోసం ఇప్పటికే సేకరించిన భూముల్లో మెగా టౌన్‌షిప్‌ను సృష్టించవచ్చని రేవంత్ రెడ్డి చెప్పారు,
మెట్రో ఫేజ్-3 ప్రణాళికలు JBS మెట్రో స్టేషన్ నుండి శామీర్‌పేట వరకు, ప్యారడైజ్ మెట్రో స్టేషన్ నుండి కండ్లకోయ లేదా మేడ్చల్ వరకు విస్తరణను కవర్ చేయాలని నొక్కి చెప్పారు. వీటితోపాటు 40 కిలోమేటర్ల మేర మూసీ రివర్ ఫ్రంట్ ఈస్ట్-వెస్ట్ కారిడార్‌ను మెట్రో రైలు ప్రాజెక్టులో చేర్చాలని, తారామతి నుంచి నార్సింగి వయా నాగోల్, ఎంజీబీఎస్ చేపట్టాలని సూచించారు. వీటన్నింటికీ సంబంధించిన ప్రణాళికలు త్వరగా సిద్ధంచేసి కేంద్ర నగరాభివృద్ధి, గృహ నిర్మాణశాఖ మంత్రికి ముసాయిదాను పంపించాలని సీఎం ఆదేశించారు.
ఆమోదం వీటికే..
– మియాపూర్-చందానగర్-బీహెచ్‌ఈఎల్-పటాన్‌చెరువు (14 కి.మీ)
– MGBS-ఫలక్‌నుమా-చంద్రాయణగుట్ట-మైలార్‌దేవ్‌పల్లి-P7 రోడ్డు-విమానాశ్రయం (23 కి.మీ)
– నాగోల్ –ఎల్‌బినగర్ -ఒవైసీ హాస్పిటల్ – చాంద్రాయణగుట్ట – మైలార్‌దేవ్‌పల్లి-ఆరామ్‌ఘర్-కొత్త హైకోర్టు స్థలం (రాజేంద్రనగర్) (19 కి.మీ)
– రాయదుర్గ్ స్టేషన్ నుండి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ( వయా బయోడైవర్సిటీ జంక్షన్, IIIT జంక్షన్, ISB రోడ్) (12 కి.మీ)
– ఎల్‌బి నగర్-వంశస్థలిపురం-హయత్‌నగర్ (8 కి.మీ)