Delhi: సీఎం రేవంత్ ఢిల్లీ టూర్ అందుకేనా.. ?

Published : Feb 20, 2024, 12:57 AM IST
Delhi: సీఎం రేవంత్ ఢిల్లీ టూర్ అందుకేనా.. ?

సారాంశం

CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం (ఫిబ్రవరి 19న) సాయంత్రం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ఆయన ప్రత్యేక విమానంలో బయలుదేరి వెళ్లారు. సీఎం రేవంత్ వెంట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబులు కూడా ఉన్నారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన తర్వాత ఏం జరుగుతుందన్న ఆసక్తి కాంగ్రెస్ పార్టీలో నెలకొంది.

CM Revanth Reddy: తెలంగాణలో రాజకీయం వేడేక్కింది.సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ సమీకరణాలు కూడా మారుతున్నాయి. ఈ తరుణంలో .. ఇన్ని రోజులు బ‌డ్జెట్ స‌మావేశాల‌తో బిజీగా ఉన్న సీఎం రేవంత్ సోమవారం (ఫిబ్రవరి 19న) సాయంత్రం ఢిల్లీ బ‌య‌లుదేరి వెళ్లారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ఆయన ప్రత్యేక విమానంలో బయలుదేరి వెళ్లారు. ముఖ్యమంత్రి వెంట డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబులు కూడా ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో వీరు ఢిల్లీ పెద్దలతో ఏం చర్చించనున్నారనేది ఆసక్తికరంగా మారింది. దీంతో     తెలంగాణ పాలిటిక్స్‎ హీట్ మరింత పెరిగింది. 

విశ్వసనీయం సమాచారం ప్రకారం.. లోక్‌సభ ఎన్నికల అభ్యర్థుల ఎంపిక, నామినేటెడ్ పదవుల భర్తీపై చర్చించేందుకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ఇతర జాతీయ సీనియర్ నేతలతో సమావేశమయ్యేందుకు సీఎం ఎ. రేవంత్ రెడ్డి అండ్ కో ఢిల్లీ వెళ్లినట్టు తెలుస్తోంది. అలాగే.. తెలంగాణకు పెండింగ్‌లో ఉన్న నిధులు మరియు ప్రాజెక్టుల క్లియరెన్స్ కోసం కేంద్ర మంత్రులతో మంగళవారం భేటీ కానున్నట్టు సమాచారం. 
 
ఈ తరుణంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరితో పాటు ఇతరులతో అపాయింట్‌మెంట్ కోరినట్లు సమాచారం. గత బిఆర్‌ఎస్‌ హయాంలో బ్యాంకుల నుంచి పొందిన లక్ష కోట్ల రూపాయల రుణాల కారణంగా రాష్ట్రం ఎదుర్కొంటున్న భారీ ఆర్థిక భారాన్ని పేర్కొంటూ, రాష్ట్ర ప్రభుత్వానికి వడ్డీ లేని రుణాలు అందించాలని నిర్మలా సీతారామన్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థించనున్నట్లు వర్గాలు తెలిపాయి.  అలాగే.. కేంద్రమంత్రి హర్‌దీప్‌సింగ్‌ పూరీతో భేటీ అయి..  హైదరాబాద్‌ మెట్రో రైలు ప్రాజెక్టు రెండో దశ, మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌ కార్యక్రమాలకు కూడా నిధులు మంజూరు చేయాలని కోరనున్నట్లు తెలుస్తోంది.  

మరోవైపు.. కాంగ్రెస్ పెద్దలతో కూడా రేవంత్ అండ్ కో భేటీ అయ్యే అవకాశముంది. ఏఐసీసీ నేతలతో భేటీలో ప్రధానంగా లోక్‌సభ ఎన్నికల అభ్యర్థుల ఎంపికపైనే దృష్టి సారించనున్నారు. తెలంగాణలోని మొత్తం 17 లోక్‌సభ స్థానాలకు జనవరి 31 నుండి ఫిబ్రవరి 3 వరకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించగా.. 309 మంది పోటీ పడిన విషయం తెలిసిందే. ఇప్పటికే.. ప్రతి నియోజకవర్గం నుంచి టాప్ 3 మెంబర్స్ ను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఈ భేటీలో ఎంపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ పై చర్చంచే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇలా బిబీబిబీగా పర్యటన ముగించుకుని మంగళవారం లేదా బుధవారం ఉదయం హైదరాబాద్ కు తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఈ పర్యటన తర్వాత ఏం జరుగుతుందన్న ఆసక్తి కాంగ్రెస్ పార్టీలో ఉత్కంఠ నెలకొంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Telangana Panchayat Elections: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్