మోడీకి సీఎం కేసీఆర్ లేఖ: ఆ పరీక్షలను ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలి

By narsimha lodeFirst Published Nov 20, 2020, 1:58 PM IST
Highlights

ప్రధానమంత్రి నరేంద్రమోడీకి తెలంగాణ సీఎం కేసీఆర్ శుక్రవారం నాడు లేఖ రాశాడు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే ఉద్యోగ నియామక పరీక్షలను ప్రాంతీయ భాషల్లో కూడ నిర్వహించాలని కోరారు.

హైదరాబాద్:  ప్రధానమంత్రి నరేంద్రమోడీకి తెలంగాణ సీఎం కేసీఆర్ శుక్రవారం నాడు లేఖ రాశాడు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే ఉద్యోగ నియామక పరీక్షలను ప్రాంతీయ భాషల్లో కూడ నిర్వహించాలని కోరారు.

కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఉద్యోగ నియామకాలకు సంబంధించిన పరీక్షలను హిందీ, ఇంగ్లీషులలోనే నిర్వహిస్తున్నారని ఆయన ఆ లేఖలో ప్రస్తావించారు.

దీంతో ప్రాంతీయ భాషల్లో చదువుకొంటున్న అభ్యర్ధులు నష్టపోతున్నారని కేసీఆర్ చెప్పారు.దీనివల్ల ఆంగ్ల మాధ్యమంలో చదువుకోని విద్యార్థులు, హిందీయేతర రాష్ట్రాల విద్యార్థులకు అన్యాయం జరుగుతోందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు.

దేశంలో అన్ని రాష్ట్రాల వారికి సమాన అవకాశాలు కల్పించాల్సిందిగా ఆయన కోరారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలన్నింటిలో ఉద్యోగాలకు పరీక్షలను ప్రాంతీయ భాషల్లోనూ నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు.

 ఇందుకు ఆదేశాలు జారీ చేస్తూ యూపీఎస్సీ, రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు, ఐబీపీఎస్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్‌కు సూచనలు చేయాలని మోడీని కోరారు సీఎం కేసీఆర్.

కీలక ప్రభుత్వ రంగ సంస్థలను ఎన్డీఏ సర్కార్ నిర్వీర్యం చేస్తోందని కేసీఆర్ ఇటీవల తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ కోసం చేస్తున్న ప్రయత్నాలను ఆయన ఎండగట్టారు.ఈ విషయమై డిసెంబర్ రెండో వారంలో హైద్రాబాద్ లో సమావేశం ఏర్పాటు చేయనున్నట్టుగా ప్రకటించిన విషయం తెలిసిందే.ఉద్యోగాల కోసం ప్రాంతీయ భాషల్లో కూడ  పరీక్షలను నిర్వహించాలని ఆయన ఇవాళ లేఖ రాశారు. 


 

click me!