హైదరాబాద్‌‌లో మూడు సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం.. ఈ నెల 26న కేసీఆర్ భూమిపూజ

Siva Kodati |  
Published : Apr 24, 2022, 09:56 PM ISTUpdated : Apr 24, 2022, 09:59 PM IST
హైదరాబాద్‌‌లో మూడు సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం.. ఈ నెల 26న కేసీఆర్ భూమిపూజ

సారాంశం

తెలంగాణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (టిమ్స్‌) పేరుతో హైదరాబాద్‌కు నలువైపులా నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ ఆసుపత్రులకు ఈ నెల 26న కేసీఆర్ భూమి పూజ చేయనున్నారు.   

హైదరాబాద్ నగరంలో ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులకు (super speciality hospitals) ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఈ నెల 26న భూమిపూజ చేయనున్నారు. నిరుపేదలకు రుపాయి ఖర్చు లేకుండా సూపర్‌ స్పెషాలిటీ వైద్యం అందించేందుకు, అలాగే సూపర్‌ స్పెషాలిటీ వైద్య విద్యను బలోపేతం చేసేందుకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నగరానికి మూడు వైపులా అధునాతన ఆసుపత్రులను నిర్మించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.

 

 

తెలంగాణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (టిమ్స్‌) (tims) పేరుతో నిర్మించే ఈ మూడు ఆసుపత్రుల నిర్మాణానికి రూ.2,679 కోట్లతో పరిపాలన అనుమతులు ఇప్పటికే మంజూరు చేసింది. కరోనా ఉధృతి సమయంలో గచ్చిబౌలిలో టిమ్స్‌ను ఏర్పాటు చేసి సేవలందించగా, ఈ మూడింటితో కలిపి టిమ్స్‌ ఆసుపత్రుల సంఖ్య నాలుగుకు చేరనున్నాయి. ఢిల్లీలోని ఎయిమ్స్ తరహాలో నగరం నలువైపులా సూపర్ స్పెషాల్టీ ఆసుపత్రులను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

 

 

ఉస్మానియా (osmania hospital) , గాంధీ (gandhi hospital) , నిమ్స్‌ (nims) .. అనేక దశాబ్దాలుగా ప్రజలకు ఈ ధర్మాసుపత్రులే పెద్దదిక్కుగా ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా నిరుపేదలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో రోగులు ఇక్కడికి వస్తుంటారు. ఏళ్లు గడిచినా.. జనాభా అంతకంతకు పెరిగినా.. ఈ ఆస్పత్రులపై భారం గణనీయంగా పెరుగుతున్నా ఉమ్మడి రాష్ట్రంలో మరో పెద్దాసుపత్రి నిర్మాణం జరుగలేదు. అయితే కేసీఆర్ నాయకత్వంలో నాలుగు సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులకు హైదరాబాద్‌ మహా నగరం వేదిక కాబోతున్నది.

ఆసుపత్రుల వివరాలు..

  • ఒక్కో ఆసుపత్రిని 13.71 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించనున్నారు.
  • ఒక్కో ఆసుపత్రిలో వెయ్యి పడకలు ఏర్పాటు చేస్తారు.
  • వైద్య విద్య కోసం పీజీ, సూపర్ స్పెషాలిటీ సీట్లు అందుబాటులోకి వస్తాయి.
  • అనుబంధంగా సూపర్ స్పెషాలిటీ ఇన్ నర్సింగ్, పారామెడికల్ విద్యకు ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు.

1) అల్వాల్ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి
మొత్తం విస్తీర్ణం: 28.41 ఎకరాలు
ఎత్తు: జీ+5 
భవనం విస్తీర్ణం: 13.71 లక్షల చదరపు అడుగులు
వ్యయం: రూ.897 కోట్లు

2) ఎల్బీనగర్ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి
మొత్తం విస్తీర్ణం: 21.36 ఎకరాలు
ఎత్తు: జీ+14
భవనం విస్తీర్ణం: 13.71 లక్షల చదరపు అడుగులు
వ్యయం: రూ.900 కోట్లు

3) సనత్ నగర్ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి
మొత్తం విస్తీర్ణం: 17 ఎకరాలు
ఎత్తు: జీ+14
భవనం విస్తీర్ణం: 13.71 లక్షల చదరపు అడుగులు
వ్యయం: రూ.882 కోట్లు

PREV
click me!

Recommended Stories

Top 10 Police Stations : ఇండియాలో టాప్ పోలీస్టేషన్లు ఇవే.. తెలుగు రాష్ట్రాల నుండి ఒకేఒక్క స్టేషన్
Complaint Against YouTuber Anvesh: యూట్యూబర్ అన్వేష్ పై కరాటే కళ్యాణి ఫిర్యాదు| Asianet News Telugu