రామగుండం స్టేషన్ లో దారుణం.. రైలుకి ఎదురెళ్లి యువకుడు ఆత్మహత్య, (వీడియో)

Siva Kodati |  
Published : Nov 21, 2021, 07:57 PM ISTUpdated : Nov 21, 2021, 08:08 PM IST
రామగుండం స్టేషన్ లో దారుణం..  రైలుకి ఎదురెళ్లి యువకుడు ఆత్మహత్య, (వీడియో)

సారాంశం

పెద్దపల్లి జిల్లా (peddapalli district) రామగుండంలో (ramagundam railway station) ) దారుణం చోటు చేసుకుంది. ఓ యువకుడు రైల్వేస్టేషన్‌లో అందరూ చూస్తుండగానే రైలుకి ఎదురెళ్లి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

పెద్దపల్లి జిల్లా (peddapalli district) రామగుండంలో (ramagundam railway station) ) దారుణం చోటు చేసుకుంది. ఓ యువకుడు రైల్వేస్టేషన్‌లో అందరూ చూస్తుండగానే రైలుకి ఎదురెళ్లి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. ఆదివారం రామగుండం రైల్వేస్టేషన్‌లో ఒడిశాకు చెందిన సంజయ్ కుమార్ (sanjay kumar) బెహరా(28) రాజధాని సూపర్ ఫాస్ట్ రైలు ఎదురుగా వెళ్లి బలవన్మరణానికి పాల్పడ్డాడు.

మృతుడు రైలుకు ఎదురుగా నిల్చోవడం గమనించిన ప్రయాణికులు, రైల్వే సిబ్బంది అతనిని చేసేందుకు ఆర్తనాదాలు చేశారు. లోకో పైలట్ సైతం రైలుని ఆపేందుకు ప్రయత్నించినా.. సాధ్యంకాక రైలు సంజయ్‌ని ఢీకొట్టడంతో అతను అక్కడికక్కడే మరణించాడు. దీంతో రామగుండం రైల్వేస్టేషన్లో ప్రయాణికులు హడలిపోయారు. కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు విచారణ ప్రారంభించారు. సంజయ్ కుమార్ ఒడిశా (odisha) రాష్ట్రానికి చెందిన వ్యక్తి అని సికింద్రాబాద్లోని ఓ హార్డ్‌వేర్‌ షాప్‌లో పనిచేస్తున్న‌ట్లు సమాచారం. శనివారం తాతకు చెప్పి ఇంటి నుంచి బయటికి వచ్చిన ఆయన రామగుండంలో ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు చెబుతున్నారు. అటు సంజయ్ మానసిక పరిస్థితి బాగాలేదని ఆయన బంధువులు పేర్కొన్నట్లుగా తెలియజేశారు.

 

"

PREV
click me!

Recommended Stories

Telangana Panchayat Elections: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్