వరంగల్‌ : ఎంజీఎం నుంచి నేరుగా సెంట్రల్ జైలుకి కేసీఆర్, ఖైదీలతో మిలాఖత్

Siva Kodati |  
Published : May 21, 2021, 04:04 PM IST
వరంగల్‌ : ఎంజీఎం నుంచి నేరుగా సెంట్రల్ జైలుకి కేసీఆర్, ఖైదీలతో మిలాఖత్

సారాంశం

వరంగల్ పర్యటనలో వున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్... ఎంజీఎం ఆసుపత్రిని సందర్శించిన అనంతరం నేరుగా సెంట్రల్‌ జైలుకు వెళ్లారు. ఆయన వెంటన మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్ సహా అధికారులు వున్నారు.

వరంగల్ పర్యటనలో వున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్... ఎంజీఎం ఆసుపత్రిని సందర్శించిన అనంతరం నేరుగా సెంట్రల్‌ జైలుకు వెళ్లారు. ఆయన వెంటన మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్ సహా అధికారులు వున్నారు.

ఈ సందర్భంగా సెంట్రల్ జైలులోని ఖైదీలను కేసీఆర్ పరామర్శించారు. జైలులో వారికి అందుతున్న సౌకర్యాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. అలాగే ఖైదీలు తయారు చేసిన పలు రకాల చేనేత, స్టీల్ ఉత్పత్తులను ముఖ్యమంత్రి పరిశీలించారు. 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలోని కరోనా రోగుల్లో మానసికస్థైర్యాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నారు. వరుసగా కరోనా ఆస్పత్రులను సందర్శిస్తూ, నేరుగా కరోనా వార్డుల్లోని రోగులతో సంభాషిస్తూ వారికి నేనున్నాననే భరోసాను ఇస్తున్నారు.

Also read:వరంగల్ ఎంజీఎంను సందర్శించిన కేసీఆర్.. కరోనా వార్డుల పరిశీలన..

తాజాగా శుక్రవారం తెలంగాణ‌ ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ ఎంజీఎంను సందర్శించారు. ఆయ‌న వెంట‌ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, వరంగ‌ల్ జిల్లా ప్రజాప్రతినిధులు, ప‌లువురు అధికారులు ఉన్నారు. 

వైద్యాధికారులు, ఆసుపత్రి సిబ్బందితో క‌లిసి ఎంజీఎంలోని సౌక‌ర్యాల‌ను ఆయ‌న అడిగి తెలుసుకుంటున్నారు. కరోనా రోగులను ప‌రామ‌ర్శించి వారికి అందుతున్న సేవలు, సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. వారికి ధైర్యం చెబుతున్నారు. 

PREV
click me!

Recommended Stories

తెలుగు రాష్ట్రాలకు మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్.. చర్లపల్లి నుంచి ఎక్కడి వరకంటే.?
TSRTC: ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్‌.. మార్చి 1 నుంచి త‌గ్గ‌నున్న బ‌స్సు ఛార్జీలు. డీపోల‌కు స‌ర్క్యూల‌ర్ జారీ