ఆ క్షణం సీఎం కళ్లలో ఆనందం మాటల్లో చెప్పలేను: మంత్రి జగదీశ్ రెడ్డి

By Siva KodatiFirst Published Oct 27, 2019, 8:44 AM IST
Highlights

సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలంలో ఎస్.ఆర్.ఎస్.సి. కెనాల్ పనులను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలించారు.

సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలంలో ఎస్.ఆర్.ఎస్.సి. కెనాల్ పనులను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలించారు.

శనివారం సాయంత్రం హుజూర్‌నగర్ లో జరుగుతున్న కృతజ్ఞతా సభకు హాజరయ్యేందుకు గాను హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు అదే కారులో వస్తున్న జిల్లా మంత్రి జగదీశ్ రెడ్డి ఇవీ కాళేశ్వరం నీళ్లు అని తెలిపారు.

ఆ వెంటనే కాన్వాయ్‌ని ఆపించిన సీఎం అక్కడికక్కడే ఆగి కారు దిగి పెన్పహాడ్ మండలానికి తరలి వెడుతున్న నీళ్లను చూసి ఆగి పరిశీలించారు.300 కిలో మీటర్ల దూరం నుండి సూర్యపేట జిల్లా చివరి అంచు వరకు పరుగులు పెడుతున్న గోదావరి జలాలను పుష్పాలు జల్లి పూజలు నిర్వహించారు.

Also Read:తొందరపడ్డ ఎమ్మెల్యే సైదిరెడ్డి: నవ్వేసిన కేసీఆర్, జగదీష్ రెడ్డి

అనంతరం స్థానిక రైతులతో ఫోటోలు దిగారు. ఈ సమయంలో తమకు మూడు నెలల పాటు నీళ్లు వదలండి అని రైతులు అడగ్గా.. మూడు నెలలు కాదు వద్దు అనే దాకా నీళ్లు ఇస్తానంటూ ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. అనంతరం చివ్వెంల మండలం తిరుమలగిరి గ్రామం వద్ద నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను కూడా సీఎం కేసిఆర్ పరిశీలించారు.

ముఖ్యమంత్రి వెంట మంత్రి జగదీశ్ రెడ్డి తదితరులు వున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తొలిసారి కన్నబిడ్డను చూసిన తల్లి ఆనందాన్ని ముఖ్యమంత్రి కళ్లలో చూశానన్నారు. 

హుజూర్ నగర్ నియోజకవర్గానికి తెలంగాణ సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. ఇటీవల జరిగిన ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి గెలుపు అందించినందుకు సీఎం కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు. 

హుజూర్ నగర్ నియోజకవర్గం గెలుపు టీఆర్ఎస్ పార్టీకి ఒక టానిక్ లా పనిచేస్తుందని చెప్పుకొచ్చారు. టీఆర్ఎస్ పార్టీకీ ఘన విజయం అందించిన ప్రజలకు అంతేవిధంగా ఫలితాలను ఇస్తానని చెప్పుకొచ్చారు. 

Also Read:హుజూర్ నగర్ కృతజ్ఞతసభ: సీఎం కేసీఆర్ వరాలజల్లు

ఈ సందర్భంగా నియోజకవర్గంలోని 130 గ్రామ పంచాయితీలకు వరాలు కురిపించారు. ఒక్కో పంచాయితీకి రూ.20 లక్షలు కేటాయించారు. అలాగే నియోజకవర్గంలో ఉన్న ఏడుమండల కేంద్రాలకు ఒక్కో మండల కేంద్రానికి రూ.30లక్షలు కేటాయిస్తున్నట్లు తెలిపారు. 

ఇకపోతే హుజూర్ నగర్ నియోజకవర్గంలోని రెండు మున్సిపాలిటీలకు వరాలజల్లు కురిపించారు. హుజూర్ నగర్ మున్సిపాలిటీకి రూ.25 కోట్లు కేటాయిస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. అలాగే నేరేడు చర్ల మున్సిపాలిటీకీ రూ.15కోట్లు కేటాయించారు. 

ఇకపోతే లంబాడా సోదరులకు ప్రత్యేకంగా ఒక రెసిడెన్షియల్ స్కూల్ ను కేటాయిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఇకపోతే హుజూర్ నగర్ నియోజకవర్గంలో రెవెన్యూ డివిజన్ ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. 

Also Reda:ఏడడుగుల మంత్రి ఏం చేయలేదు, మా మూడడుగుల బుల్లెట్ నీళ్లు తెచ్చాడు: జగదీష్ రెడ్డిపై కేసీఆర్

అలాగే సిమ్మెంట్ ఫ్యాక్టీరీలు అత్యధికంగా ఉన్న నేపథ్యంలో హుజూర్ నగర్ లో ఈఎస్ఐ ఆస్పత్రి వచ్చేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. కేంద్రప్రభుత్వంతో మాట్లాడి ఈఎస్ఐ ఆస్పత్రి చెల్లిస్తామని హామీ ఇచ్చారు. 

అలాగే హుజూర్ నగర్ నియోజకవర్గంలో పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు చేయనున్నట్లు కేసీఆర్ చెప్పుకొచ్చారు. అలాగే హుజూర్ నగర్ లో రెండు మండలాలను కలుపుతూ కోర్టును కూడా ఇస్తున్నట్లు సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. 

click me!