రామానుజ సహస్రాబ్ది సమారోహం వేడుకల్లో పవన్ కల్యాణ్.. సమతామూర్తిని దర్శించుకున్న జనసేనాని

Siva Kodati |  
Published : Feb 06, 2022, 08:28 PM ISTUpdated : Feb 06, 2022, 08:48 PM IST
రామానుజ సహస్రాబ్ది సమారోహం వేడుకల్లో పవన్ కల్యాణ్.. సమతామూర్తిని దర్శించుకున్న జనసేనాని

సారాంశం

రామానుజాచార్య సహస్రాబ్ది సమారోహం వేడుకల్లో జనసేన అధినేత , పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. సమతామూర్తి విగ్రహాన్ని దర్శించుకుని, 108 దివ్యదేశాలను దర్శించుకున్నారు. ముచ్చింతల్‌కు పవన్‌ కల్యాణ్‌ రాక విషయాన్ని తెలుసుకున్న అభిమానులు.. ఆయనను చూసేందుకు ఎగబడ్డారు.

ముచ్చింతల్‌లోని (muchintal) చినజీయర్ ఆశ్రమంలో (chinna jeeyar swamy ashram muchintal) రామానుజాచార్య సహస్రాబ్ది సమారోహం వేడుకల్లో జనసేన (janasena) అధినేత, సినీనటుడు పవన్ కల్యాణ్ (pawan kalyan) పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమతామూర్తి విగ్రహాన్ని (samatha murthy) ఆయన దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడి విశేషాలను పవన్ అడిగి తెలుసుకున్నారు. విగ్రహం చుట్టూ ఉన్న 108 దివ్యదేశాలను దర్శించుకున్నారు. అనంతరం ప్రవచన మండపంలో చినజీయర్‌ స్వామిని కలిసి ఆశీర్వచనాలు అందుకున్నారు. మరోవైపు ముచ్చింతల్‌కు పవన్‌ కల్యాణ్‌ రాక విషయాన్ని తెలుసుకున్న అభిమానులు.. ఆయనను చూసేందుకు ఎగబడ్డారు.

ఇకపోతే శనివారం ముచ్చింతల్‌లోని శ్రీరామానగరంలో సమతామూర్తి విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోడీ (narendra modi) ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మనిషి జీవితంలో గురువు అత్యంత కీలకమని.. మనం గురువును దేవుడితో కొలుస్తామని, ఇది మన భారతదేశ గొప్పతనమని మోడీ గుర్తుచేశారు. దేశ సంస్కృతిని ఈ సమతామూర్తి మరింత బలోపేతం చేస్తుందని ప్రధాని మోడీ ఆకాంక్షించారు. 108 దివ్యదేశ మందిరాలను ఇక్కడే చూశానని.. శ్రీరామానుజాచార్యులు (sri ramanujacharya) విశిష్టద్వైతం ప్రవచించారని ప్రధాని తెలిపారు. రామానుజాచార్యుల విగ్రహం జ్ఞానం, ధ్యానానికి ప్రతీక అని మోడీ పేర్కొన్నారు. 

ప్రగతిశీలత, ప్రాచీనతలో భేదం లేదని రామానుజార్యులను చూస్తే తెలుస్తుందన్నారు. వెయ్యేళ్ల కిందట మూఢ విశ్వాసాలు ఎంతగా ఉంటాయో అర్ధం చేసుకోవచ్చని ప్రధాని వెల్లడించారు. మూఢ విశ్వాసాలను తొలగించేందుకు ఆనాడే రామానుజాచార్యులు కృషి చేశారని మోడీ కొనియాడారు. ఆనాడే దళితులను కలుపుకుని ముందుకు సాగారని... ఆలయాల్లో దళితులకు దర్శనభాగ్యం కలిగించారని ప్రధాని తెలిపారు. రామానుజాచార్య బోధనలు ప్రపంచానికి దారి చూపిస్తాయని ఆయన అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ (dr br ambedkar) కూడా రామానుజాచార్య ప్రవచనాలనే చెప్పారని మోడీ గుర్తుచేశారు. 

సమాజంలో అందరికీ సమాన అవకాశాలు దక్కాలని.. అందరూ సమానంగా అభివృద్ధి చెందాలని ప్రధాని ఆకాంక్షించారు. సబ్ కా సాథ్.... సబ్ కా వికాస్ నినాదంతో ఈ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఉజ్వల్ పథకం, జన్‌ధన్, స్వచ్ఛ్‌భారత్ వంటి పథకాలన్నీ అందులో భాగమేనని ప్రధాని పేర్కొన్నారు. గురుమంత్రాన్ని రామానుజాచార్య అందరికీ అందించారని .. దేశ ఐక్యతకు ఆయన స్పూర్తి అని, దేశమంతటా పర్యటించారని మోడీ తెలిపారు. 

అందుకే దళిత అణగారిన వర్గాల కోసం తమ ప్రభుత్వం పనిచేస్తోందని ప్రధాని పేర్కొన్నారు. స్వాతంత్ర్య పోరాటం కేవలం దేశ ప్రజల అధికారం కోసమే కాదని ప్రధాని అన్నారు. తెలుగు సంస్కృతి దేశ భిన్నత్వాన్ని బలోపేతం చేస్తోందని.. శాతవాహనులు, కాకతీయులు, విజయనగర రాజులు తెలుగు సంస్కృతిని పోషించారని మోడీ వెల్లడించారు. పోచంపల్లికి ప్రపంచ వారసత్వ గ్రామంగా ఘనత దక్కిందని ప్రధాని చెప్పారు. అలాగే రామప్ప ఆలయానికి ప్రపంచ వారసత్వ హోదా దక్కిందని నరేంద్ర మోడీ అన్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Hyderabad: మ‌రో హైటెక్ సిటీ రాబోతోంది.. డేటా సెంట‌ర్ల‌తో HYDలోని ఈ ప్రాంతం పూర్తిగా మార‌నుంది
Telangana : తొలివిడత పంచాయతీ పోలింగ్ షురూ.. ఈ ఎన్నికలకే ఇంత ఖర్చా..!