తెలంగాణ సీఎం కేసీఆర్ న్యూఢిల్లీ నుండి బుధవారం నాడు హైద్రాబాద్ కు రానున్నారు.8 రోజుల తర్వాత కేసీఆర్ హైద్రాబాద్ కు వస్తున్నారు.
న్యూఢిల్లీ:: తెలంగాణ సీఎం కేసీఆర్ న్యూఢిల్లీ నుండి హైద్రాబాద్ కు బుధవారంనాడు రానున్నారు. గత మంగళవారం నాడు కేసీఆర్ ఢిల్లీకి వెళ్లారు. ఇవాళ హైద్రాబాద్ కు వస్తారు. ఇవాళ న్యూఢిల్లీ నుండి హైద్రాబాద్ కు రాగానే అందుబాటులో ఉన్న మంత్రులు,అధికారులతో కేసీఆర్ సమావేశం కానున్నారు .
బీఆర్ఎస్ విస్తరణ విషయమై ఆపార్టీ చీఫ్ కేసీఆర్ ఢిల్లీ వేదికగా చర్చలు జరిపారు.అయితే ఈ సమయంలోనే కేసీఆర్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. కేసీఆర్ కు జ్వరం వచ్చింది. ఢిల్లీలోని తన నివాసంలోనే కేసీఆర్ చికిత్స తీసుకున్నారు.
ఈ నెల 11న యూపీ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ పార్థీవ దేహనికి నివాళులర్పించిన తర్వాత కేసీఆర్ ఢిల్లీకి వెళ్లారు. అదే రోజు సాయంత్రం న్యూఢిల్లీలోని బీఆర్ఎస్ తాత్కాలిక కార్యాలయాన్ని కేసీఆర్ పరిశీలించారు. మరునాడు వసంత విహార్ లో పార్టీ నూతన భవనం నిర్మాణ పనులను పరిశీలించి పలు సూచనలు చేశారు. పలు రాష్ట్రాల్లో పార్టీని విస్తరించేందుకు అవలంభించాల్సిన వ్యూహంపై కేసీఆర్ చర్చించారు. మేధావులు, జర్నలిస్టుటు,రైతు సంఘాల ప్రతినిధులతో కేసీఆర్ చర్చించారు.
alsoread:తెలంగాణ సీఎం కేసీఆర్ కి జ్వరం: ఢిల్లీలోనే చికిత్స
మునుగోడు ఉప ఎన్నిక తర్వాత కేసీఆర్ దేశంలోని పలు రాష్ట్రాల్లో పర్యటనను ప్రారంభించనున్నారు.మహారాష్ట్ర నుండి కేసీఆర్ తన పర్యటనను ప్రారంభించే అవకాశం ఉంది. ఈ నెల 5వ తేదీన టీఆర్ఎస్ పేరు మార్పునకు సంబంధించి టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం తీర్మానం చేసింది. ఈ తీర్మానం మేరకు టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చారు. ఈ తీర్మానం కాపీని టీఆర్ఎస్ ప్రతినిధులు ఈసీకి అందించారు.ఇదిలా ఉంటే మునుగోడు ఉప ఎన్నికల్లో ఈ నెల 30వ తేదీన కేసీఆర్ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. మునుగోడులో నిర్వహించే సభలో కేసీఆర్ పాల్గొంటారు.