మధ్యప్రదేశ్ ఏటీఎస్, హైద్రాబాద్ ఇంటలిజెన్స్ పోలీసులు ఇవాళ మరో ఇద్దరు హెచ్‌యుటీ మద్దతుదారులను అరెస్ట్ చేశారు.
హైదరాబాద్: మధ్యప్రదేశ్ ఏటీఎస్, హైద్రాబాద్ ఇంటలిజెన్స్ పోలీసులు సోమవారంనాడు మరో ఇద్దరు హెచ్ యుటీ మద్దతుదారులను పోలీసులు అరెస్ట్ చేశారు.మధ్యప్రదేశ్ ఏటీఎస్, హైద్రాబాద్ కౌంటర్ ఇంటలిజెన్స్ ప్రతినిధులు ఇవాళ హైద్రాబాద్ లో సోదాలు నిర్వహించారు. నగరంలోని బాబానగర్, చాంద్రాయణగుట్టలలో ఇద్దరిని అరెస్ట్ చేశారు. దీంతో మొత్తం అరెస్టుల సంఖ్య 19కి చేరింది. అరెస్టైన వారిలో మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు 11 మంది., మిగిలిన ఎనిమిది మంది హైద్రాబాద్ కు చెందిన వారు. హైద్రాబాద్ కు సమీపంలో గల అనంతగిరి గుట్టల్లో నిందితులు ఆయుధాలు, పేలుడు పదార్ధాల వినియోగంలో శిక్షణ పొందారని పోలీసులు గుర్తించారు.
ఈ నెల 9వ తేదీన మధ్యప్రదేశ్ ఏటీఎస్, హైద్రాబాద్ పోలీసులు 16మందిని అరెస్ట్ చేశారు. మరునాడే మరొకరిని హైద్రాబాద్ లో అరెస్ట్ చేశారు. షాపింగ్ మాల్స్, ప్రభుత్వ కార్యాలయాలు, జనం రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో విధ్వంసం చేయాలని ఉగ్రమూకలు ప్లాన్ చేశాయి.
హైద్రాబాద్ లో సుమారు 18 మాసాలుగా నిందితులు తలదాచుకుంటున్నట్టుగా పోలీసులు గుర్తించారు. హైద్రాబాద్, భోపాల్ లలో డ్రోన్ల ద్వారా దాడులు చేయాలని కూడా నిందితులు ప్లాన్ చేసిన విషయాన్ని పోలీసులు తమ దర్యాప్తులో గుర్తించారు. ఈ టీమ్ సభ్యులు మూకుమ్మడిగా కాకుండా సింగిల్ గా విధ్వంసాలు చేయాలని ప్లాన్ చేశారని దర్యాప్తు సంస్థలు గుర్తించాయి.
హైద్రాబాద్ లో ఎక్కడెక్కడ విధ్వంసం చేయాలని నిందితులు ప్లాన్ చేశారనే విషయమై దర్యాప్తు సంస్థలు ఆరా తీస్తున్నాయి. ఇప్పటికే అరెస్టైన నిందితులను మధ్యప్రదేశ్ ఏటీఎస్ టీమ్ కస్టడీలోకి తీసుకొని విచారిస్తుంది. ఏటీఎస్ టీమ్ కస్టడీలో ఉన్న నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు ఇవాళ మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు.
also read:హైద్రాబాద్‌లో ఉగ్రమూకల పక్కా ప్లాన్: డార్క్ వెబ్ సైట్‌లో నిందితుల సంభాషణ
దేశంలో ఎక్కడ ఉగ్రదాడి జరిగా హైద్రాబాద్ తో ఏదో ఒక లింకు బయటపడేది. అయితే ఇటీవల కాలంలో ఈ తరహ ఘటనలు తగ్గాయి. కానీ హైద్రాబాద్‌లోనే మొత్తం 19 మంది అరెస్ట్ కావడం కలకలం రేపుతుంది. నిందితులు తమ ఉనినికి బయటకు రాకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకున్నారు. డార్క్ వెబ్ సైట్లను ఉపయోగించారు. మరో వైపు హైద్రాబాద్ గోల్కోండలో నివాసం ఉన్న హెచ్ యూటీ కీలక నేత నివాసంలో వీరంతా తరచగా సమావేశాలు నిర్వహించిన విషయాన్ని దర్యాప్తు సంస్థలు గుర్తించాయి.