తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ ఏడాది అక్టోబర్ మాసంలో విజయవాడకు వెళ్లనున్నారు. సీపీఐ జాతీయ మహసభలు అక్టోబర్ 14 నుండి 18వ తేదీ వరకు సీపీఐ జాతీయ మహసభలను నిర్వహించనున్నారు. ఈ మహసభల్లో పాల్గొనాలని కేసీఆర్ కు సీపీఐ నేతలు ఆహ్వానం పలికారు.
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ విజయవాడకు వెళ్లనున్నారు. ఈ ఏడాది అక్టోబర్ మాసంలో విజయవాడకు కేసీఆర్ వెళ్తారు. సీపీఐ జాతీయ మహసభల్లో పాల్గొనేందుకు సీఎం కేసీఆర్ విజయవాడకు వెళ్లనున్నారు. జాతీయ మహసభల్లో పాల్గొనాలని సీఎం కేసీఆర్ ను సీపీఐ జాతీయ నేతలు ఆహ్వానించారు. అక్టోబర్ 14 నుండి 18వ తేదీ వరకు సీపీఐ జాతీయ మహసభలు విజయవాడలో నిర్వహించనున్నారు. అక్టోబర్ 16 లేదా 17 తేదీలో సీఎం కేసీఆర్ విజయవాడకు వెళ్లే అవకాశం ఉంది. సీపీఐ జాతీయ మహసభల్లో సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కూడా పాల్గొంటారు. కేరళ, బీహర్ రాష్ట్రాల సీఎంలకు కూడా సీపీఐ ఆహ్వనాలు పంపినట్టుగా ప్రచారం సాగుతుంది. ఈ మహసభల్లో పలు దేశాలకు చెరందిన కమ్యూనిస్టు నేతలు కూడా హాజరయ్యే అవకాశం ఉంది.
మూడేళ్ల క్రితం తెలంగాణ సీఎం కేసీఆర్ విజయవాడకు వెళ్లారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి రావాలని సీఎం కేసీఆర్ జగన్ ను ఆహ్వానించారు. చంద్రబాబునాయుడు ఏపీ సీఎంగా ఉన్న సమయంలో కూడా కేసీఆర్ విజయవాడకు వెళ్లారు. అంతేకాదు అమరావతి శంకుస్థాపన సమయంలో కూడా సీఎం కేసీఆర్ పాల్గొన్నారు.
బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని కేసీఆర్ భావిస్తున్నారు. జాతీయ పార్టీ ఏర్పాటుకు కూడా రంగం సిద్దం చేసుకుంటున్నారు. ఈ తరుణంలోనే బీజేపీకి వ్యతిరేకంగా తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. బీజేపీ నేతలు కూడా అదే స్థాయిలో కేసీఆర్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. మునుగోడు అసెంబ్లీ స్థానానికి త్వరలో జరిగే ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ కు సీపీఐ మద్దతును ప్రకటించింది. గత నెల 20వ తేదీన కేసీఆర్ నిర్వహించిన సభలో సీపీఐ రాష్ట్ర సహయ కార్యదర్శి పల్లా వెంకట్ రెడ్డి కూడా పాల్గొన్నారు.