తెలంగాణ సీఎం కేసీఆర్‌కి కరోనా సోకింది. ప్రస్తుతం ఆయన హోం ఐసోలేషన్ లో ఉన్నాడు.
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్‌కి కరోనా సోకింది. ప్రస్తుతం ఆయన హోం ఐసోలేషన్ లో ఉన్నాడు. ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ సోమవారం నాడు ప్రకటించారు. కేసీఆర్ కు స్వల్ప లక్షణాలు ఉన్నాయని ఆయన చెప్పారు.
undefined
గతంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ కి కూడ కరోనా సోకింది. ఆయన కరోనా నుండి కోలుకొన్నారు. గజ్వేల్ నియోజకవర్గంలోని ఎర్రవెల్లిలో తన వ్యవసాయ క్షేత్రంలో సీఎం కేసీఆర్ విశ్రాంతి తీసుకొంటున్నారు. కేసీఆర్ ను డాక్టర్ల బృందం పర్యవేక్షిస్తోందని సీఎస్ తెలిపారు.
also read:జిహెచ్ఎంసీ పరిధిలో కరోనా కంట్రోల్ రూం: కేసీఆర్ సర్కార్ కీలక నిర్ణయం
ఈ నెల 14వ తేదీన నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని హలియాలో నిర్వహించిన టీఆర్ఎస్ ఎన్నికల ప్రచారసభలో కేసీఆర్ పాల్గొన్నారు. నాగార్జునసాగర్ లో టీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసిన నోముల భగత్ తో పాటు ఆయన కుటుంబసభ్యులకు కరోనా సోకింది. మరో టీఆర్ఎస్ నేత కోటిరెడ్డికి కూడ కరోనా సోకింది.
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. కరోనా కేసుల వ్యాప్తిని నిరోధించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకొంటుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. గత ఏడాది రాష్ట్రంలో కరోనా కేసులు తీవ్రంగా ఉన్న సమయంలో కూడ కేసీఆర్ కి కరోనా సోకలేదు. కానీ ఈ దఫా మాత్రం కేసీఆర్ కరోనా బారినపడ్డారు.