ఆరేళ్ల చిన్నారిపై అరవయేళ్ల వృద్దుడి అత్యాచారం... సంచలన తీర్పునిచ్చిన న్యాయస్థానం

Arun Kumar P   | Asianet News
Published : Apr 19, 2021, 07:00 PM IST
ఆరేళ్ల చిన్నారిపై అరవయేళ్ల వృద్దుడి అత్యాచారం... సంచలన తీర్పునిచ్చిన న్యాయస్థానం

సారాంశం

కామంతో కళ్లు మూసుకుపోయి అభం శుభం తెలియని చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడికి  కఠిన శిక్ష విధించింది న్యాయస్థానం. 

హైదరాబాద్: మైనర్ బాలికపై జరిగిన అత్యాచారం కేసులో కోర్టు సంచలన తీర్పునిచ్చింది. కామంతో కళ్లు మూసుకుపోయి అభం శుభం తెలియని చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడికి 14ఏళ్ళ కఠిన కారాగార శిక్ష విధించింది న్యాయస్థానం. 

ఈ కేసుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఉపాధి నిమిత్తం మహారాష్ట్ర నుండి హైదరాబాద్ కు వలస వచ్చిన కొప్రగడి సంజయ్(58) ఎల్బీ నగర్ లోని ఎన్టీఆర్ నగర్ లోనివాసముండేవాడు. అదే కాలనీలో నివాసముండే కవల పిల్లలపై కన్నేశాడు. ఈ క్రమంలోనే ఇతడు 2017లో ఓ రోజు మద్యాహ్నం బలవంతంగా ఇంట్లోకి చొరబడి కవలల్లోని ఓ ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

కూతురిపై అఘాయిత్యానికి పాల్పడుతుండగా గుర్తించిన తల్లి అడ్డుకోడానికి ప్రయత్నించింది. అయితే ఆమెను బెదిరించిన సంజయ్ అక్కడినుండి పరారయ్యాడు. దీంతో బాదిత బాలిక తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసి నిందితున్ని అరెస్ట్ చేశారు. 

గత మూడేళ్లుగా ఈ కేసును విచారిస్తున్న న్యాయస్థానం తాజాగా తుదితీర్పును ప్రకటించింది. చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడిన సంజయ్ కి 14ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించడము కాదు రూ.20వేల జరిమానా విధించింది.  

PREV
click me!

Recommended Stories

Pensions: తెలంగాణ‌లో రూ. 4 వేలకి పెర‌గ‌నున్న‌ పెన్ష‌న్‌.. ఎప్ప‌టి నుంచి అమ‌లు కానుంది? ప్ర‌భుత్వం ప్లాన్ ఏంటి.?
School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే