జ్వరంతో బాధపడుతున్న కేసీఆర్: ప్రగతి భవన్ లోనే వైద్యుల చికిత్స

Published : Sep 26, 2023, 09:25 PM ISTUpdated : Sep 26, 2023, 09:42 PM IST
జ్వరంతో బాధపడుతున్న కేసీఆర్: ప్రగతి భవన్ లోనే వైద్యుల చికిత్స

సారాంశం

తెలంగాణ సీఎం కేసీఆర్ జ్వరంతో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని కేటీఆర్ ప్రకటించారు.


హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్  జ్వరం, దగ్గుతో బాధపడుతున్నారని  మంత్రి కేటీఆర్ చెప్పారు.వారం రోజులుగా  సీఎం కేసీఆర్ కు  వైద్యులు చికిత్స అందిస్తున్నారన్నారు.  కొద్ది రోజుల్లోనే కేసీఆర్ ఆరోగ్యం మెరుగయ్యే అవకాశం ఉందని వైద్యులు చెప్పారని కేటీఆర్ తెలిపారు.వారం రోజులుగా కేసీఆర్ కు వైరల్ ఫీవర్ వచ్చినట్టుగా కేటీఆర్ చెప్పారు.  యశోద ఆసుపత్రికి చెందిన వైద్యులు సీఎం కేసీఆర్ కు చికిత్స అందిస్తున్నారని కేటీఆర్ తెలిపారు.  

 

మంగళవారం నాడు రాత్రి  ట్విట్టర్ వేదికగా  కేటీఆర్ ఈ విషయాన్ని ప్రకటించారు.గతంలో  ఆరోగ్య సమస్యలు తలెత్తిన సమయంలో  కేసీఆర్ యశోద ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు.అయితే ఈ దఫా కేసీఆర్ కు యశోద ఆసుపత్రి వైద్యులు ప్రగతి భవన్ లోనే చికిత్స అందిస్తున్నారు. 

2020  జనవరి 21న స్వల్ప అనారోగ్య సమస్యలతో సీఎం కేసీఆర్ ఆసుపత్రిలో చేరారు.దగ్గు, జ్వరం కారణంగా  ఆయన ఆసుపత్రికి వెళ్లారు. వైద్య పరీక్షల నిమిత్తం కేసీఆర్ తిరిగి ప్రగతి భవన్ కు వచ్చారు.ఈ ఏడాది మార్చి 12న కేసీఆర్ అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో కేసీఆర్ వైద్య పరీక్షల కోసం  ఏఐజీ ఆసుపత్రికి వెళ్లారు.  గంటన్నర పాటు  కేసీఆర్ కు వైద్యులు పరీక్షలు చేశారు.పరీక్షల తర్వాత అవసరమైన మందులను కేసీఆర్ కు వైద్యులు ఇచ్చారు. వైద్య పరీక్షల తర్వాత కేసీఆర్ తిరిగి వెళ్లిపోయారు.
 

PREV
click me!

Recommended Stories

Sydney Bondi Beach ఉగ్రదాడి: నిందితుడు సాజిద్ అక్రమ్‌కు హైదరాబాద్ లింకులు.. భారత పాస్‌పోర్ట్‌తో షాకింగ్ !
Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?