అడవుల రక్షణకు గ్రీన్ బెటాలియన్స్‌ ఏర్పాటు: కేసీఆర్ (వీడియో)

First Published Aug 1, 2018, 1:20 PM IST
Highlights

తెలంగాణలో అడవులు, పచ్చదనాన్ని రక్షించడం కోసం గ్రీన్ బెటాలియన్స్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అటవీ అధికారులను ఆదేశించారు . ఇందుకు అవసరమైతే పోలీస్ శాఖ సహకారం తీసుకోవాలని సూచించారు . 

గజ్వేల్: తెలంగాణలో అడవులు, పచ్చదనాన్ని రక్షించడం కోసం గ్రీన్ బెటాలియన్స్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అటవీ అధికారులను ఆదేశించారు . ఇందుకు అవసరమైతే పోలీస్ శాఖ సహకారం తీసుకోవాలని సూచించారు . 

తెలంగాణ సీఎం కేసీఆర్  నాలుగో విడత హరిత హారం కార్యక్రమాన్ని బుధవారం నాడు  గజ్వేల్‌‌లో ప్రారంభించారు. గజ్వేల్ పట్టణంలోని ఇందిరాపార్క్ లో సీఎం కేసీఆర్ కదంబ మొక్కను నాటి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

తెలంగాణలో తగ్గిపోతున్న అడవుల విస్తీర్ణాన్ని పెంచేందుకు గాను ప్రతి ఏటా హరిత హారం పేరుతో మొక్కల పెంపకానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.నాలుగోవిడత హరిత హారం కార్యక్రమాన్ని  తెలంగాణ సీఎం కేసీఆర్ బుధవారం నాడు గజ్వేల్‌లో కదంబ మొక్క నాటి ప్రారంభించారు. 

సీఎం కేసీఆర్  మొక్క నాటిన తర్వాత  గజ్వేల్‌ పట్టణంలో ఒకేసారి  లక్షా16 వేల మొక్కలను నాటారు.  గజ్వేల్ కు వెళ్లే దారిలో సీఎం కేసీఆర్  మేడ్చల్ జిల్లా శామీర్‌పేట మండలం తుర్కపల్లిలోని రాజీవ్ రహదారిపై ఆకాశమల్లె మొక్క నాటారు. ఆ తర్వాత సిద్దిపేట జిల్లా ములుగులో అంజయ్యే అనే వ్యక్తి ఇంట్లో కొబ్బరిమొక్క నాటారు. 

గజ్వేల్ లో సిఎం మొక్క నాటుతున్న సమయంలోనే అన్ని ప్రార్థనా మందిరాల్లో సైరన్ మోగించగానే ప్రజలందరూ ఒకేసారి మొక్కలు నాటారు.  గజ్వేల్ పరిధిలో ఉన్న ప్రతీ ఇంట్లో, అన్ని రకాల రోడ్లపైనా, ఔటర్ రింగ్ రోడ్డుపైనా, ప్రభుత్వ-ప్రైవేటు విద్యాసంస్థల్లో, ప్రార్థనా మందిరాల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లోని ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటారు. 

 గజ్వేల్ పట్టణాన్ని 8 క్లస్టర్లుగా విభజించి, ప్రత్యేక అధికారులను నియమించి,  ఒక్కో క్లస్టర్ లో 15వేలకు పైగా మొక్కలు నాటారు. గజ్వేల్, ప్రజ్ఞాపూర్ మున్సిపాలటీ పరిధిలో సుమారు 75 వేల పండ్ల మొక్కలు ( కొబ్బరి, జామ, దానిమ్మ, మామిడి, అల్లనేరడు), 16 వేల పూల మొక్కలు, పది వేల అటవీ జాతులకు చెందిన మొక్కలను నాటారు.  పట్టణ ప్రాంతానికి నీడను, స్వచ్చమైన గాలిని ఇచ్చే ఆకర్షణీయమైన చెట్లతో పాటు, ప్రతీ ఇంటికీ రోజూ ఉపయోగపడే కరివేపాకు, మునగ లాంటి మొక్కలు, ఇళ్ల ముందు, వెనకా ఉన్న ఖాళీ స్థలాల్లో  పెంచుకునే పూలు, పండ్ల మొక్కలను కూడా  నాటించారు. బహిరంగ ప్రదేశాల్లో నాటిన అన్ని మొక్కలకు రక్షణ కోసం ట్రి గార్డులను అధికారులు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. 

గజ్వేల్ వెళ్లే సమయంలో దారిలో ఉన్న సింగాయపల్లి ఫారెస్ట్ లోపలికి వెళ్ళి చాలా సేపు కలియదిరిగి పరిశీలించారు . ఫారెస్ట్ రక్షణకు అధికారులు తీసుకుంటున్న చర్యలను అభినందించారు . స్థానిక ఫారెస్ట్ అధికారులకు రూ 5 లక్షల రివార్డు ఇవ్వనున్నట్లు సీఎం ప్రకటించారు . అవసరమైన స్థాఫ్ ను , బడ్జెట్ ఇస్తామని రాష్ట్రంలో అడవుల పెంపకంలో భారీ స్థాయిలో మొక్కలు నాటడంలో రాజీపడేది లేదన్నారు 

ఎమ్మెల్యే ల వనబోజనం ఏర్పాట్లు చేయాలని ఆయన సూచించారు.అడవి చాలా సేపు కలియదిరిగి చూసిన ముఖ్యమంత్రి ఒక సారి ఎమ్మెల్యేలతో వనబోజనం ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.

 

ఈ వార్త చదవండి:మీకు ఏ సీఎం ఇష్టం: విద్యార్ధులు, ఆసక్తికర సమాధానమిచ్చిన గవర్నర్

 

           "


 

click me!