
హైదరాబాద్:వైఎస్ఆర్ ప్రకటించిన ఉచిత కరెంట్ ఉత్త కరెంట్ గానే ఉండేదని తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పారు.
గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చకు సీఎం కేసీఆర్ సమాధానమిచ్చారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ సమస్యలను అధిగమించినట్టుగా ఆయన చెప్పారు. పోడు భూముల సమస్యలను తాము పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ సమస్యను పరిష్కరించాలని తనకు ఎవరు కూడ ధరఖాస్తులు ఇవ్వకముందే తాను ఈ హామీ ఇచ్చినట్టుగా ఆయన గుర్తు చేశారు.
బడ్జెట్ తో పాటు ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ లెక్కలు సభకు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.2014 వేసవిలో 12.23 లక్షల ఎకరాల్లో పంట సాగైందన్నారు.ప్రస్తుత వేసవిలో 58 లక్షల ఎకరాల్లో పంట సాగు చేసినట్టుగా ఆయన గుర్తు చేశారు.
గవర్నర్ టీఆర్ఎస్ మాటలనే చెప్పిందని భట్టి విక్రమార్క వ్యంగ్యాస్త్రాలను సంధించారని ఆయన చెప్పారు. తాము చాలా కార్యక్రమాలు చేశామని అందుకే బుక్ చాలా పెద్దగా ఉందన్నారు. ప్రభుత్వం చేసింది భట్టి విక్రమార్క చెప్పడం లేదన్నారు.
రెండేళ్లుగా భారీ వర్షాలు కురిసినా చెరువులు తెగకపోవడానికి మిషన్ కాకతీయ కారణమన్నారు.తెలంగాణ అంతటా భూగర్భజలాలు పెరిగాయని పార్లమెంట్ కు ఇచ్చిన నీతి ఆయోగ్ నివేదికలో పేర్కొందన్నారు.మిషన్ కాకతీయ ఓ సక్సెస్ స్టోరీ అని ఆయన చెప్పారు.
14 టీఎంసీల నుండి 220 టీఎంసీలకు పెంచేందుకు ప్రాజెక్టులను రీడిజైన్ చేశామన్నారు. కోటి 60 లక్షల ఎకరాల వ్యవసాయభూమిలో కోటి 53 లక్షల ఎకరాలు ధరణిలోకి వచ్చాయన్నారు.విద్యుత్ లో చాలా అభివృద్ది చేశామన్నారు. కానీ అది కూడ చెప్పలేదన్నారు. సోలార్ పవర్ 70 మెగావాట్ల నుండి 4840 మెగావాట్లకు పెంచినట్టుగా ఆయన చెప్పారు.
సూర్యాపేటకు కాకతీయ కాలువ నీళ్లు వస్తాయని ఎవరైనా కలలు కన్నారా అని ఆయన ప్రశ్నించారు.పెండింగ్ మ్యూటేషన్లు అన్నింటిని క్లియర్ చేస్తున్నామన్నారు. తెలంగాణలో భూములన్నీ సర్వే చేస్తామని చెప్పారు.
గొర్రెలు, చేపలు పంచుతుంటే మమ్మల్ని విమర్శిస్తున్నారన్నారు. ఇప్పుడు దేశంలోనే అత్యధికంగా తెలంగాణలో గొర్రెలున్నాయన్నారు.గుంట భూమి ఉన్నవారికి కూడా రైతు భీమాను అమలు చేస్తున్నామని ఆయన చెప్పారు. బీడీ కార్మికులకు పెన్షన్ ఇచ్చే ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని కేసీఆర్ తెలిపారు.