అన్ని రంగాల్లో దూసుకుపోవడమే తెలంగాణ పునర్నిర్మాణానికి ప్రతీక: కేసీఆర్

By narsimha lode  |  First Published Apr 30, 2023, 3:31 PM IST

తెలంగాణ సచివాలయం కూల్చివేతపై విపక్షాలు  చేసిన విమర్శలపై తెలంగాణ సీఎం  కేసీఆర్  కౌంటర్ ఇచ్చారు. అన్ని రంగాల్లో  తెలంగాణ  దూసుకుపోతుందన్నారు. విపక్షాలకు  కేసీఆర్ కౌంటరిచ్చారు.  


హైదరాబాద్; అన్ని రంగాల్లో  రాష్ట్రం  దూసుకుపోతుందని తెలంగాణ  సీఎం కేసీఆర్ చెప్పారు. తెలంగాణ పునర్నిర్మాణానికి ఇదే ప్రతీకగా  ఆయన  పేర్కొన్నారు. ఆదివారంనాడు  తెలంగాణ సచివాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం   మంత్రులు, ఉద్యోగులనుద్దేశించి  సీఎం  కేసీఆచ్ ప్రసంగించారు.  సమ్మిళిత  అభివృద్దితో  తెలంగాణ ముందుకు సాగుతుందని  కేసీఆర్  చెప్పారు.  ఐటీలో బెంగుళూరును దాటి తెలంగాణ  దూసుకుపోతోందని  కేసీఆర్ తెలిపారు.  

సచివాలయం కూల్చివేతపై విపక్షాలు  చేసిన విమర్శలపై  కేసీఆర్ మండిపడ్డారు. నేడు  తెలంగాణ ఆకాశమంత ఎత్తకు ఎదిగిందన్నారు.  సచివాలయం కూలుస్తారా అని తప్పుడు  ప్రచారం చేశారన్నారు.  ఇప్పుడు వారికి బుద్దివచ్చేలా  ఆకాశమంతా అద్భుతమైన  సచివాలయాన్ని నిర్మించినట్టుగా ఆయన తెలిపారు.  సచివాలయం కూల్చివేత సమయంలో విపక్షాలు చేసిన విమర్శలకు కేసీఆర్ కౌంటరిచ్చారు.  

Latest Videos

అంబేద్కర్, గాంధీజీ  సూపిన మార్గంలోనే తెలంగాణ సాధించుకున్నామని  కేసీఆర్ గుర్తు  చేశారు.   అంబేద్కర్  రాసిన రాజ్యాంగంలోని  ఆర్టికల్  3 వల్లే ప్రత్యేక తెలంగాణ  రాష్ట్రం వచ్చిందన్నారు. సచివాలయానికి  అంబేద్కర్ పేరు పెట్టుకోవడం గర్వకారణంగా ఆయన  పేర్కొన్నారు.  

కొత్త  సచివాలయాన్ని  ప్రారంభించడం తనకు  దక్కిన అదృష్టంగా  కేసీఆర్ పేర్కొన్నారు. సచివాలయ  నిర్మాణంలో అందరి కృషి ఉందన్నారు.  సచివాలయ తరహలోనే తెలంగాణ పల్లెలు వెలుగుతున్నాయని కేసీఆర్  చెప్పారు.   తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో  ఆత్మార్పణం  చేసిన ప్రతి ఒక్కరికి  జోహర్లు అర్పిస్తున్నట్టుగా సీఎం తెలిపారు.  

తెలంగాణ పునర్నిర్మాణంపై  కొందరు అవాకులు  చెవాకులు  పేలారని కేసీఆర్  మండిపడ్డారు.  తెలంగాణ మొత్తం కూలగొట్టి  కడతారా అని  హేళన  చేశారన్నారు. మత్తడి దూకుతున్న  చెరువులే రాష్ట్ర పునర్నిర్మాణానికి తార్కాణంగా  కేసీఆర్ పేర్కొన్నారు.  

మిషన్ కాకతీయతో  చెరువుల రూపురేఖలను  మార్చినట్టుగా  కేసీఆర్ వివరించారు.  విమర్శలు  పట్టించుకోకుండా  రాష్ట్రాభివృద్దికి  కృషి చేయడమే తమ విధానంగా  కేసీఆర్  పేర్కొన్నారు. చెక్ డ్యామ్ ల వల్ల  వేసవిలోనూ నీళ్లు పుష్కలంగా  ఉన్నాయన్నారు. .  తెలంగాణ పునర్నిర్మాణానికి మిషన్ భగీరథ  ప్రతీకగా  ఆయన  పేర్కొన్నారు.పదేళ్లలో  రాష్ట్రంలో   మల్లర్లు లేకుండా శాంతి భద్రతలను కాపాడిన విషయాన్ని కేసీఆర్ గుర్తు చేశారు.  

యాదాద్రి  పుణ్యక్షేత్రం  భూలోక వైకుంఠంగా  విరాజిల్లుతోందని  కేసీఆర్  చెప్పారు. యాదాద్రి పునర్నిర్మాణం  కూడా తెలంగాణ పునర్మిర్మాణంలో భాగంగా  ఆయన పేర్కొన్నారు.  తెలంగాణ సచివాలయం  తెలంగాణ పునర్మిర్మాణానికి నిలువెత్తు నిదర్శనంగా ఆయన  పేర్కొన్నారు. ప్రపంచ ఇంజీనింగ్ అద్భుతాలుగా  ప్రాజెక్టులను నిర్మించుకున్న విషయాన్ని కేసీఆర్  ప్రస్తావించారు. కోల్పోయిన  అడవులు తిరిగి తెచ్చుకోవడం రాష్ట్ర పునర్మిర్మాణంలో భాగమేనని కేసీఆర్  చెప్పారు.

also read:తెలంగాణ నూతన సచివాలయం:ప్రారంభించిన కేసీఆర్

వలస వెళ్లిన  పాలమూరు  బిడ్డలు వెనక్కి రావడం కూడా పునర్నిర్మాణంలో భాగమేనని  కేసీఆర్ తెలిపారు. మరుగుజ్జుల్లారా  ఇప్పటికైనా మీ కళ్లను మార్చుకోవాలని  కేసీఆర్ విపక్షాలకు సూచించారు.  తలసరి ఆదాయంలో  తెలంగాణ నంబర్ వన్ గా ఉందని  కేసీఆర్  చెప్పారు.  
 

click me!