మాపై నిందలా?: సీఎల్పీ టీఆర్ఎస్‌ఎల్పీలో విలీనంపై కేసీఆర్

By narsimha lodeFirst Published Jul 18, 2019, 12:36 PM IST
Highlights

టీర్ఎస్‌ఎల్పీలో సీఎల్పీ విలీనంపై గురువారం నాడు తెలంగాణ అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగబద్దంగానే ఈ ప్రక్రియ సాగిందన్నారు. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో జరిగిన విలీన ప్రక్రియలను ఆయన గుర్తు చేశారు.

హైదరాబాద్:  మీ ఎమ్మెల్యేలను కాపాడుకోలేక తమను నిందించడం సరైంది కాదని తెలంగాణ సీఎం కేసీఆర్ కాంగ్రెస్‌పై మండిపడ్డారు. తెలంగాణ అసెంబ్లీలో రాజ్యాంగబద్దంగానే టీఆర్ఎస్‌ఎల్పీలో సీఎల్పీ విలీనం జరిగిందన్నారు.

గురువారం నాడు తెలంగాణ ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో మున్సిఫల్ బిల్లుపై చర్చ జరిగే సమయంలో  కాంగ్రెస్ పక్ష నేత మల్లుభట్టి విక్రమార్క తమ పార్టీ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్‌లో చేర్చుకొన్నారని చెప్పారు. సీఎల్పీని టీఆర్ఎస్‌ఎల్పీలో విలీనం చేయడాన్ని తప్పుబట్టారు.

ఈ విషయమై సీఎం కేసీఆర్ స్పందించారు.   మీ పార్టీ  ఎమ్మెల్యేలను మీరే కాపాడులేక మాపై నిందలు వేయడాన్ని తప్పుబట్టారు. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బలహీన పడిందన్నారు. గోవాలో కూడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు బీజేపీలో విలీనమైన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ అసెంబ్లీలో సీఎల్పీ టీఆర్ఎస్‌ఎల్పీ విలీనం కూడ రాజ్యాంగ బద్దంగానే జరిగిందని ఆయన చెప్పారు.

మరో వైపు ఇటీవలనే ఏపీ రాష్ట్రానికి చెందిన టీడీపీ ఎంపీలు కూడ బీజేఎల్పీలో విలీనం చేసినట్టుగా ఉపరాష్ట్రపతి బులెటిన్ విడుదల చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడ ఈవీఎంలపై ఇలానే మాట్లాడారని కాంగ్రెస్‌పై విమర్శలు చేశారు. పంచాయితీ ఎన్నికల్లో 83 శాతం స్థానాలను కైవసం చేసుకొన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 32 జిల్లా పరిషత్ చైర్మెన్ స్థానాలను కూడ బ్యాలెట్ పద్దతిలోనే తమ పార్టీ గెలుచుకొందని కేసీఆర్ చెప్పారు.


 

click me!