కేసీఆర్ సతీమణి శోభ, ఎమ్మెల్సీ కవిత వారణాసి పర్యటన

Published : Jan 28, 2021, 10:03 AM IST
కేసీఆర్ సతీమణి శోభ, ఎమ్మెల్సీ కవిత వారణాసి పర్యటన

సారాంశం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సతీమణి శోభ, నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితలు వారణాసిలో రెండు రోజులు పర్యటించనున్నారు. వీరితో పాటు వీరి కుటుంబసభ్యులు ఈ పర్యటనలో పాల్గొంటారు. 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సతీమణి శోభ, నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితలు వారణాసిలో రెండు రోజులు పర్యటించనున్నారు. వీరితో పాటు వీరి కుటుంబసభ్యులు ఈ పర్యటనలో పాల్గొంటారు. 

ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలోని కాశీవిశ్వేశ్వరుని దర్శనార్థం వీరు బయలుదేరారు. నేడు, రేపు రెండు రోజుల వీరు కాశీలో పర్యటించనున్నారు. 

మొదటి రోజైన ఈ రోజు ముందుగా అస్సి ఘాట్ నుంచి దశాశ్వమేధ ఘాట్ వరకు బొట్లో ప్రయాణం చేస్తారు.  దశాశ్వమేధ ఘాట్ లో గంగా పూజ చేసి,  గంగా ఆర్తి దర్శించుకుంటారు. ఆ తరువాత అస్సి ఘాట్ కు బోట్లో‌ తిరుగు‌ ప్రయాణం.

అనంతరం సంకట్విమోచన్ దేవాలయ దర్శనం చేసుకుని, దేవుడికి పట్టు వస్త్రాల‌ సమర్పిస్తారు. ప్రత్యేక పూజలు చేస్తారు. 

PREV
click me!

Recommended Stories

Panchayat Elections : తెలంగాణ పంచాయతీ ఎన్నికలు.. మూడో దశలోనూ కాంగ్రెస్ హవా
IMD Cold Wave Alert : మరోసారి కుప్పకూలనున్న టెంపరేచర్స్.. ఈ నాల్రోజులు చుక్కలే