పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై కేసీఆర్ సమీక్ష: పనుల పురోగతిపై ఆరా

Published : May 01, 2023, 02:38 PM ISTUpdated : May 01, 2023, 04:45 PM IST
పాలమూరు-రంగారెడ్డి  ప్రాజెక్టుపై కేసీఆర్ సమీక్ష: పనుల పురోగతిపై ఆరా

సారాంశం

పాలమూరు-రంగారెడ్డి  ప్రాజెక్టుపై తెలంగాణ సీఎం  కేసీఆర్  ఇవాళ  సచివాలయంలో సమీక్ష  నిర్వహించారు. 


హైదరాబాద్: పాలమూరు-రంగారెడ్డి    ప్రాజెక్టుపై  తెలంగాణ సీఎం  కేసీఆర్ సోమవారంనాడు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు.  తెలంగాణ సచివాలయాన్ని  సీఎం కేసీఆర్  నిన్న ప్రారంభించారు.  ఇవాళ  కొత్త సచివాలయం నుండి కేసీఆర్  విధులు  నిర్వహిస్తున్నారు.  2014 లో  తెలంగాణ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత  ఆనాడు  ఉన్న సచివాలయానికి సీఎం కేసీఆర్  కొంత కాలం పాటు వచ్చారు. ఆ తర్వాత  సచివాలయానికి   కేసీఆర్ రావడం మానేశారు.

 ప్రగతి భవన్  నుండే  కేసీఆర్  కార్యకలాపాలు  నిర్వహించారు.  కొత్త  సచివాలయం  నిన్న ప్రారంభమైంది. ఇవాళ  ఉదయం  కేసీఆర్  కొత్త సచివాలయానికి  వచ్చారు.   గ్రేటర్ హైద్రాబాద్ ప్రాంతానికి  చెందిన  ప్రజా ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.  ఆ తర్వాత   పాలమూరు- రంగారెడ్డి   ప్రాజెక్టుపై  కేసీఆర్ సమీక్ష  నిర్వహించారు.  ప్రాజెక్టు పనుల పురోగతిని  సీఎం అధికారులతో సమీక్షించారు.

ఈ ప్రాజెక్టు పరిధిలో  రిజర్వాయర్ల  నిర్మాణం, భూసేకరణ పనులపై  సీఎం కేసీఆర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.  ఉమ్మడి  మహబూబ్ నగర్, ఉమ్మడి నల్గొండ. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలకు  సాగు తాగు నీటిని అందించేందుకు ఈ ప్రాజెక్టును ప్రతిపాదించారు.  ప్రాజెక్టు  పనుల  పురోగతిపై   అధికారులు  సీఎం  కేసీఆర్ కు   వివరించారు.  
 

PREV
click me!

Recommended Stories

School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?