కనురెప్పపాటు కూడా కరెంట్ పోవద్దు, త్వరలో పవర్ వీక్: కేసీఆర్

By Nagaraju penumalaFirst Published Jul 31, 2019, 8:37 PM IST
Highlights

విద్యుత్ సంస్థలు ఆర్థిక ఇబ్బందులు పడొద్దనేది తమ ప్రభుత్వ విధానమని సీఎం కేసీఆర్ తెలిపారు. ప్రభుత్వ సంస్థలు, స్థానిక సంస్థలు ప్రతీ నెలా కరెంట్ కట్టేలా కఠినమైన విధానం అవలంభిస్తామని స్పష్టం చేశారు. గ్రామాలు, పట్టణాల్లో త్వరలో పవర్ వీక్ నిర్వహిస్తామని తెలిపారు.  
 
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కనురెప్పపాటు కరెంట్ పోకుండా చూడాలని అధికారులకు ఆదేశించారు సీఎం కేసీఆర్.  బుధవారం ప్రగతిభవన్ లో విద్యుత్ శాఖపై సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. 

విద్యుత్ సంస్థలకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం కేసీఆర్ భరోసా ఇచ్చారు. విద్యుత్ సంస్థల పనితీరుపైనే రాష్ట్రాభివృద్ధి ఆధారపడి ఉందని తెలిపారు. కనురెప్పపాటు కూడా కరెంటు పోవద్దని అధికారులకు దిశానిర్దేశం చేశారు. 

విద్యుత్ సంస్థలు ఆర్థిక ఇబ్బందులు పడొద్దనేది తమ ప్రభుత్వ విధానమని సీఎం కేసీఆర్ తెలిపారు. ప్రభుత్వ సంస్థలు, స్థానిక సంస్థలు ప్రతీ నెలా కరెంట్ కట్టేలా కఠినమైన విధానం అవలంభిస్తామని స్పష్టం చేశారు. గ్రామాలు, పట్టణాల్లో త్వరలో పవర్ వీక్ నిర్వహిస్తామని తెలిపారు.  

రాష్ట్రంలో సోలార్ విద్యుత్ వినియోగం పెరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రాజెక్టుల వద్ద కూడా సోలార్ ప్రాజెక్టుల వినియోగంపై చర్యలు తీసుకోవాలని సూచించారు. సోలార్ విద్యుత్ కోసం టెండర్లు పిలవాలని అధికారులకు సీఎం కేసీఆర్ సూచించారు.

click me!