ఎన్టీఆర్ అభిమానిని...అందుకే టీఆర్ఎస్ టికెట్ ఇవ్వలేదు : బాబూమోహన్

Published : Jul 31, 2019, 07:31 PM IST
ఎన్టీఆర్ అభిమానిని...అందుకే టీఆర్ఎస్ టికెట్ ఇవ్వలేదు : బాబూమోహన్

సారాంశం

సింగూరు నీటి తరలింపునకు అడ్డు చెప్పినందుకే తనకు టికెట్ ఇవ్వలేదని బాబూ మోహన్ ఆరోపించారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయ పార్టీ, ధీటైన పార్టీ బీజేపీయేనని చెప్పుకొచ్చారు. మిషన్ కాకతీయ పేరుతో అభివృద్ధి చేయకుండా చెరువులోని మట్టిని అక్రమంగా అమ్ముకుంటున్నారంటూ బాబూమోహన్ ధ్వజమెత్తారు.  

సంగారెడ్డి: టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత బాబూమోహన్. టీఆర్ఎస్ పార్టీ చేతల పార్టీ కాదంటూ విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం మాటలు మాత్రమే చెప్తోందని చేతల ప్రభుత్వం కాదంటూ ఎద్దేవా చేశారు. 

సింగూరు నీటి తరలింపునకు అడ్డు చెప్పినందుకే తనకు టికెట్ ఇవ్వలేదని బాబూ మోహన్ ఆరోపించారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయ పార్టీ, ధీటైన పార్టీ బీజేపీయేనని చెప్పుకొచ్చారు. మిషన్ కాకతీయ పేరుతో అభివృద్ధి చేయకుండా చెరువులోని మట్టిని అక్రమంగా అమ్ముకుంటున్నారంటూ బాబూమోహన్ ధ్వజమెత్తారు.

సినీ ఇండస్ట్రీలోనూ, పాలిటిక్స్ లోనూ తనకు దివంగత సీఎం ఎన్టీఆర్ అంటే ఎంతో ఇష్టమని చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ అభిమానిని కాబట్టే ఆయనకు ఇష్టమైన బీజేపీలో చేరానని బాబూమోహన్ స్ఫస్టం చేశారు.  

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : దేశవ్యాప్తంగా వర్షాలు, ఈ తెలుగు జిల్లాల్లోనూ.. ఎల్లో అలర్ట్ జారీ
హైదరాబాద్‌లో రూ. 13 ల‌క్ష‌లే అపార్ట్‌మెంట్‌.. ఎవ‌రు అర్హులు, ఎలా సొంతం చేసుకోవాలంటే.?