కొత్త చట్టాల అమలులో పేదలు ఇబ్బంది పడొద్దు: అధికారులతో కేసీఆర్

By Siva KodatiFirst Published Sep 24, 2020, 8:32 PM IST
Highlights

కార్పోరేషన్ల  పరిధిలోని మేయర్లు, ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయ్యారు. కొత్త  చట్టాల అమలుకు ప్రజా ప్రతినిధులు శ్రమించాలని కేసీఆర్ సూచించారు. 

కార్పోరేషన్ల  పరిధిలోని మేయర్లు, ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయ్యారు. కొత్త  చట్టాల అమలుకు ప్రజా ప్రతినిధులు శ్రమించాలని కేసీఆర్ సూచించారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా నూతన చట్టాలను రూపొందిస్తున్నట్లు ఆయన తెలిపారు.

నిరుపేదలకు ఫలితాలు అందేలా చూడటమే లక్ష్యమని కేసీఆర్ వెల్లడించారు. దశాబ్ధాలుగా పెండింగ్‌లో ఉన్న ఇళ్లు, ఆస్తుల సమస్యకు పరిష్కారం లభించిందన్నారు. భూముల క్రమబద్ధీకరణ ద్వారా పేదల డబ్బులతో ఖజానా నింపాలని లేదని సీఎం పేర్కొన్నారు.

Also Read:కొత్త రెవిన్యూ బిల్లులకు గవర్నర్ ఆమోదముద్ర: అమల్లోకి చట్టం

ధరణి పోర్టల్ పూర్తి స్థాయిలో రూపు దిద్దుకునే లోపు ప్రజలు ఎదుర్కొంటున్న భూములు, ఆస్తుల సమస్యలు అన్నింటిని గుర్తించి వాటికి విధానపరమైన పరిష్కారాలు రూపొందించాలని కేసీఆర్ ఆదేశించారు. కొత్త చట్టాల అమలులో నిరుపేదలకు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా కార్యాచరణ రూపొందించాలని ముఖ్యమంత్రి సూచించారు. 

తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త రెవిన్యూ బిల్లుకు గవర్నర్ తమిళిసై ఆమోదం తెలిపారు. దీంతో ఈ బిల్లు చట్టంగా మారింది. కొత్త చట్టం అమల్లోకి వచ్చిందని ప్రభుత్వం ప్రకటించింది.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త రెవిన్యూ బిల్లులను ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదించింది. ఈ నెల 11వ తేదీన ఈ బిల్లును అసెంబ్లీ ఆమోదించిన విషయం తెలిసిందే. అసెంబ్లీతో పాటు శాసనమండలిలో కూడ ఈ బిల్లులు ఆమోదం పొందాయి.

click me!