
కరోనా పరిస్ధితులపై సీఎం కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఇప్పటికే వైద్యాధికారులు ప్రగతి భవన్‌కు చేరుకున్నారు. ప్రధానితో సమావేశానికి ముందే వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో కేసీఆర్ సమావేశమవుతున్నారు. కరోనా కేసుల వివరాలు, వ్యాక్సినేషన్‌పై ఆరా తీయనున్నారు కేసీఆర్.
మరోవైపు దేశంలో కరోనా కేసులు రోజు రోజుకూ పెరుగుతుండటంతో.. కేంద్రం అలర్ట్ అయ్యింది. వైరస్‌ను కట్టడి చేసేందుకు చర్యలు వేగవంతం చేసింది. ఇందులో గురువారం ప్రధాని మోడీ దేశంలోని అన్ని రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.
ఈ భేటీలో కరోనా వ్యాప్తి, ప్రస్తుత పరిస్థితులు, వ్యాక్సినేషన్ లాంటి అంశాలపై ముఖ్యమంత్రులతో మోడీ చర్చించనున్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేసేలా చర్యలు చేపట్టాలని ఆదేశించనున్నట్లు తెలుస్తోంది.
అలాగే కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న ప్రాంతాల్లో లాక్‌డౌన్ విధించడంపైనా చర్చించే అవకాశం ఉంది. వైరస్ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన చర్యలను అడిగి తెలుసుకోనున్నారు మోదీ. అలాగే కరోనా నియంత్రణలో విఫలమవుతున్న రాష్ట్రాలకు ప్రధాని కీలక సూచనలు చేయనున్నారు.