అభివృద్ధి చేయడానికి సీనియర్ ఏంటీ.. జూనియర్ ఏంటీ: జానారెడ్డికి తలసాని చురకలు

By Siva KodatiFirst Published Apr 8, 2021, 3:54 PM IST
Highlights

సాగర్ ఉప ఎన్నిక నేపథ్యంలో రాజకీయ పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్ధి జానారెడ్డిపై విరుచుకుపడ్డారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

సాగర్ ఉప ఎన్నిక నేపథ్యంలో రాజకీయ పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్ధి జానారెడ్డిపై విరుచుకుపడ్డారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.

ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా హాలియాలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 35 ఏళ్ళుగా జానారెడ్డి మభ్యపెడుతున్న ప్రజలను చైతన్యం చేయడానికే టీఆర్ఎస్ నాయకులు వచ్చారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.

ఇప్పటికే జానారెడ్డి మునిగిపోయి ఉన్నారని, కాంగ్రెస్ నాయకులు ఆయనను ఇంకా ముంచుతారని సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ అత్యధిక మెజార్టీతో గెలుస్తారని, తమ అందరి కృషి పలిస్తుందని తలసాని జోస్యం చెప్పారు.

Also Read:ఎవరి లెక్కలు వారివే: పార్టీల భవిష్యత్ తేల్చేది సాగర్ ఎన్నికనే..

2014కు ముందు యువత ఆత్మహత్యలపై పరిశీలన చేసుకోవాలని.. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు తగ్గుముఖం పట్టాయని మంత్రి చెప్పారు. యువత తొందర పడి ప్రాణాలు తీసుకొవద్దని, అతి త్వరలోనే మరొక 50 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామని హామీ ఇచ్చారు.

కాంగ్రెస్ పార్టీకి నిరుద్యోగ సమస్యపై మాట్లాడే అర్హత లేదని శ్రీనివాస్ యాదవ్ ఎద్దేవా చేశారు. అభివృద్ధి చేయడానికి సీనియర్ ఏంటీ.. జూనియర్ ఏంటీ అని మంత్రి తలసాని ప్రశ్నించారు. జానారెడ్డి ఓటమి భయంతోనే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆయన అన్నారు

click me!