RTCపై సీఎం కేసీఆర్ సమీక్షా సమావేశం: ఈడీల కమిటీ నివేదికపై చర్చ

Published : Oct 25, 2019, 06:46 PM ISTUpdated : Oct 25, 2019, 07:02 PM IST
RTCపై సీఎం కేసీఆర్ సమీక్షా సమావేశం: ఈడీల కమిటీ నివేదికపై చర్చ

సారాంశం

ఆర్టీసీపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతిభవన్‌లో సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ భేటీకి రవాణా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఆర్టీసీ ఇన్‌ఛార్జి ఎండీ సునీల్ శర్మతో పాటు పలువురు ఉన్నతాధికారులు ఆయనను కలిశారు.  కార్మికుల 21 డిమాండ్లపై ఆర్టీసీ ఈడీలు తయారుచేసిన నివేదికను వారు ముఖ్యమంత్రికి అందజేశారు. 

ఆర్టీసీపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతిభవన్‌లో సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ భేటీకి రవాణా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఆర్టీసీ ఇన్‌ఛార్జి ఎండీ సునీల్ శర్మతో పాటు పలువురు ఉన్నతాధికారులు ఆయనను కలిశారు.  కార్మికుల 21 డిమాండ్లపై ఆర్టీసీ ఈడీలు తయారుచేసిన నివేదికను వారు ముఖ్యమంత్రికి అందజేశారు.

హైకోర్టుకు కార్మికులు అందజేసిన 45 డిమాండ్లలో ప్రధానమైన, అమలు చేయడానికి వీలుగా ఉన్న 21 డిమాండ్లపై కమిటీ అధ్యయనం చేసింది. ఒక్కో సమస్యకు రెండేసి పరిష్కార మార్గాలను కమిటీ తన నివేదికలో పొందుపరిచింది.

ఈ నివేదికను 28న హైకోర్టుకు అందజేయాల్సి ఉంటుంది. అయితే ఈ లోగానే కార్మిక సంఘాల నేతలతో చర్చలు జరపాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకు రెండు రోజులు మాత్రం సమయం ఉండటంతో సునీల్ శర్మ.. నివేదిక సారాంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లుగా సమాచారం. 

Also Read:RTC strike: ఆర్టీసీ ఖతమ్: ఆర్టీసీ సమ్మెపై తేల్చేసిన కేసీఆర్

హుజూర్‌నగర్‌ ఉపఎన్నికలో విజయం సాధించిన అనంతరం గురువారం మీడియాతో మాట్లాడిన సీఎం కేసీఆర్ ఆర్టీసీ సమ్మెపై స్పందిస్తూ... ఆర్టీసీ కార్మికులు ఎత్తుకున్నది పిచ్చి పంథా అంటూ తిట్టిపోశారు. ఆర్టీసీ కార్మికులు దురంహకారంతో అర్థంపర్థం లేని పంథాను ఎన్నుకున్నారని కేసీఆర్ విమర్శించారు. 

హుజూర్ నగర్ ఎన్నికల ఫలితం ఇచ్చిన విశ్వాసంతో ఆర్టిసి సమ్మెపై కేసీఆర్ తన వైఖరిని మరింత స్పష్టం చెప్పేశారు. ఆర్టీసీ అనేదే ఇకపై వుండదని తేల్చేశారు.

ఆర్టీసీని బలోపేతం చేసేందుకు తాను కష్టపడతానని హామీ ఇచ్చానని చెప్పుకొచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నా ఆర్టీసీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని చెప్పినట్లు గుర్తు చేశారు. 

Also Read;తెలుగు రాష్ఠ్రాల్లో ఆర్టీసీ విలీనం చిచ్చు: జగన్ కమిటీపై కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

ఆర్థికమంది నేపథ్యంలో వేలాది మంది ఉద్యోగాలు కోల్పోతున్నారని చెప్పుకొచ్చారు. దేశాన్ని తీవ్రంగా ఆర్థికమాంద్యం సంస్థ వేధిస్తోందని చెప్పుకొచ్చారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఎంతోమంది ఉద్యోగాలు కోల్పోతున్నారని చెప్పుకొచ్చారు. 

గతఐదేళ్లలో 21 శాతం అభివృద్ధి చెందితే ఈ ఏడాది 2.3కి పడిపోయామని చెప్పుకొచ్చారు. రాష్ట్ర అభివృద్ధి 2.3శాతానికి పడిపోయామని ఈసారి చాలా జాగురుకతతో వ్యవహరించాలని బడ్జెట్ రూపకల్పన పుస్తకంలో స్పష్టం చేసినట్లు తెలిపారు. 

 

రవాణా శాఖ మంత్రిగా మూడేళ్లు పనిచేసినట్లు చెప్పుకొచ్చారు. రోడ్డు రవాణా సంస్థకు తన కంటే బాగా తెలిసిన వ్యక్తి ఎవరూ ఉండరని చెప్పుకొచ్చారు. 1997-98లో నష్టాల్లో ఉన్న ఆర్టీసీని 44 కోట్లు లాభాల్లోకి తీసుకువచ్చిన ఘనత తనదేనని చెప్పుకొచ్చారు. ఆర్టీసీ సంస్థ అంటే తనకు ఎంతో అభిమానం అని చెప్పుకొచ్చారు కేసీఆర్.

Also Read:RTC Strike: సైదిరెడ్డి గెలుపు లోగుట్టు కేసీఆర్ కెరుక...

ఆర్టీసీ అధికారులు కనీసం సమావేశం పెట్టుకునేందుకు కూడా కార్యాలయాలు లేవన్నారు. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 44శాతం జీతాలు పెంచామని అలాగే ఎన్నికలకు ముందు మళ్లీ పెంచామని మెుత్తం నాలుగేళ్లలో 67శాతం కార్మికుల జీతాలు పెంచినట్లు కేసీఆర్ చెప్పుకొచ్చారు.

భారతదేశ చరిత్రలో ఏ ఆర్టీసీ చరిత్రలో నాలుగు సంవత్సరాల వ్యవధిలో 67శాతం జీతాలు పెంచిన చరిత్ర ఎక్కడైనా ఉందా అని నిలదీశారు.   

PREV
click me!

Recommended Stories

Renu Desai Fire on Media: మీడియా పైరెచ్చిపోయిన రేణు దేశాయ్ | Asianet News Telugu
Renu Desai Strong Comments On Street Dogs: కుక్కల మరణాలపై రేణు దేశాయ్ ఉగ్రరూపం | Asianet News Telugu