ఆర్ అండ్ బీ శాఖపై కేసీఆర్ సమీక్ష... కొత్త సచివాలయంపై కీలక వ్యాఖ్యలు

By Siva Kodati  |  First Published Nov 17, 2022, 9:56 PM IST

గురువారం రోడ్లు భవనాల శాఖపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్ల మరమ్మత్తులపై ఆయన అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో వుంచుకునే కొత్త సచివాలయ నిర్మాణం చేపట్టినట్లు కేసీఆర్ వెల్లడించారు.


డిసెంబర్ రెండో వారంలోగా రోడ్ల మరమ్మత్తు పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు తెలంగాణ సీఎం కేసీఆర్. రోడ్ల నిర్వహణ పూర్తి బాధ్యత ఆర్ అండ్ బీ, పంచాయితీ రాజ్ శాఖలదేనన్నారు. క్షేత్రస్థాయిలో మరింత మందిని ఇంజినీర్లను నియమించుకోవాలని కేసీఆర్ సూచించారు. సూపర్ స్పెషాలిటీల్లో ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. కొత్తగా నిర్మిస్తోన్న సూపర్ స్పెషాలిటీలను పటిష్టంగా నిర్మించాలని కేసీఆర్ ఆదేశించారు.  కార్పోరేట్ ఆసుపత్రులకు ధీటుగా వరంగల్ సూపర్ స్పెషాలిటీని నిర్మించాలని ఆయన ఆదేశించారు. 

అంతకుముందు నూతనంగా నిర్మిస్తోన్న తెలంగాణ సచివాలయాన్ని కేసీఆర్ పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడి నిర్మాణాలను పరిశీలించి అధికారులకు కీలక సూచనలు చేశారు. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా తెలంగాణ సచివాలయం నిర్మిస్తున్నట్లు కేసీఆర్ తెలిపారు. కొత్త సచివాలయ నిర్మాణం అమరవీరుల త్యాగఫలమని సీఎం అన్నారు. సచివాలయ ప్రాంగణంలో హెలిప్యాడ్ నిర్మిస్తామని కేసీఆర్ పేర్కొన్నారు. బలహీన వర్గాల సుపరిపాలన కోసమే అంబేద్కర్ పేరు పెట్టామని.. భవిష్యత్ అవసరాలను దృష్టిలో వుంచుకునే కొత్త సచివాలయ నిర్మాణం చేపట్టినట్లు కేసీఆర్ వెల్లడించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే కొత్త సచివాలయం వుంటుందన్నారు. 

Latest Videos

ALso REad:2023 ఎన్నికల విజయమే లక్ష్యం.. ఓటర్లను ఆకర్శించేందుకు ‘మునుగోడు మోడల్’లో ప్రచారం చేయాలని కేసీఆర్ ప్లాన్..

మరోవైపు.. నిమ్స్ విస్తరణపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. రాష్ట్రంలో 10 వేల సూపర్ స్పెషాలిటీ పడకల ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలోనే నిమ్స్ ఆసుపత్రిలో 2000 పడకల్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందుకు రూ.1,571 కోట్ల నిధులను కేటాయిస్తూ వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటకే 4 వేల పడకలతో హైదరాబాద్‌కు నాలుగు వైపులా టిమ్స్ ఆసుపత్రితో పాటు వరంగల్‌లో 2000 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం చేసేలా చర్యలు తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. 

click me!