బాసర ట్రిపుల్ ఐటీలో ర్యాగింగ్ కలకలం.. పోలీసులకు చేరిన వ్యవహారం

By Siva KodatiFirst Published Nov 17, 2022, 7:26 PM IST
Highlights

బాసర ట్రిపుల్ ఐటీలో ర్యాగింగ్ వ్యవహారం కలకలం రేపుతోంది. జూనియర్లను సీనియర్లు వేధిస్తున్నారంటూ అసిస్టెంట్ డీన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన పోలీసులు ఐదుగురు సీనియర్ విద్యార్ధులపై కేసు నమోదు చేశారు.

బాసర ట్రిపుల్ ఐటీలో ర్యాగింగ్ వ్యవహారం కలకలం రేపుతోంది. జూనియర్లను సీనియర్లు వేధిస్తున్నారంటూ అసిస్టెంట్ డీన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొంతకాలంగా క్యాంపస్‌లో ర్యాగింగ్ సాగుతున్నట్లుగా ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపిన పోలీసులు ఐదుగురు సీనియర్ విద్యార్ధులపై కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

ఇకపోతే.. గత కొంతకాలంగా బాసర ట్రిపుల్ ఐటీ వార్తల్లో నిలుస్తోన్న సంగతి తెలిసిందే. ట్రిపుల్ ఐటీలో వసతులు సరిగా లేవని, భోజనం బాగుండటం లేదంటూ విద్యార్ధులు కొన్నిరోజుల పాటు ఆందోళన చేశారు. అయితే మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి ప్రభుత్వ పెద్దల హామీతో పిల్లలు నిరసనకు స్వస్తి పలికారు. తాజాగా ర్యాగింగ్ విషయం వెలుగులోకి రావడంతో ప్రభుత్వం ఎలా స్పందిస్తో వేచి చూడాలి. 

click me!