ఉస్మానియాలోకి వర్షపు నీరు: సుమోటోగా తీసుకొన్న హెచ్ఆర్‌సీ

By narsimha lodeFirst Published Jul 16, 2020, 6:28 PM IST
Highlights

ఉస్మానియా ఆసుపత్రిలోకి వర్షపు నీళ్లు చేరిన ఘటనను హెచ్ఆర్‌సీ సుమోటోగా తీసుకొంది. ఈ ఏడాది ఆగష్టు 21వ తేదీలోపుగా నివేదిక ఇవ్వాలని ఉస్మానియా సూపరింటెండ్ ను ఆదేశించింది.


హైదరాబాద్: ఉస్మానియా ఆసుపత్రిలోకి వర్షపు నీళ్లు చేరిన ఘటనను హెచ్ఆర్‌సీ సుమోటోగా తీసుకొంది. ఈ ఏడాది ఆగష్టు 21వ తేదీలోపుగా నివేదిక ఇవ్వాలని ఉస్మానియా సూపరింటెండ్ ను ఆదేశించింది.

రెండు రోజులుగా తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. హైద్రాబాద్ లో కూడ ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిశాయి. దీంతో ఉస్మానియా ఆసుపత్రిలోకి వర్షపు నీటితో పాటు పక్కనే ఉన్న డ్రైనేజీ నీళ్లు కూడ వచ్చి చేరాయి. దీంతో ఆసుపత్రిలో రోగులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు.

Latest Videos

రోగులు చికిత్స పొందే రూముల్లో వర్షపు నీటితో దుర్గంధం నెలకొంది. పాత భవనం రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో డాక్టర్లు, సిబ్బంది, రోగులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని గడిపారు.


నీళ్లు చేరిన వార్డుల నుండి రోగులను ఇతర వార్డుల్లోకి మార్చారు. గురువారం నాడు ఉదయం ఆసుపత్రుల్లోని పలు వార్డుల్లో  వర్షపు నీరు నిలిచిపోవడంతో వైద్యులు, సిబ్బంది వెళ్లలేని పరిస్థితి నెలకొంది.

ఈ పరిస్థితులపై మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. దీంతో హెచ్ఆర్‌సీ స్పందించింది. ఈ ఘటనను సుమోటోగా తీసుకొంది. నివేదిక ఇవ్వాలని హెచ్ఆర్‌సీ ఉస్మానియా సూపరింటెండ్ ను గురువారం నాడు ఆదేశించింది. ఈ మేరకు ఇవాళ సూపరింటెండ్ కు నోటీసులు జారీ చేసింది.  కరోనా సోకిన  ఉస్మానియా సూపరింటెండ్ ప్రస్తుతం నిమ్స్ లో చికిత్స పొందుతున్నారు. 

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ, కాంగ్రెస్ నేతలు భట్టి విక్రమార్క, దుద్దిళ్ల శ్రీధర్ బాబులు ఉస్మానియా ఆసుపత్రిని సందర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం తీరును ఎండగట్టారు.

click me!