ఎవరికి ఎవరు అన్యాయం చేశారు: పాలేరులో తుమ్మలకు కేసీఆర్ కౌంటర్


పాలేరులో నిర్వహించిన బీఆర్ఎస్ ఆశీర్వాద సభలో తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ పాల్గొన్నారు.  ఈ సభలో  మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,  మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలపై  కేసీఆర్ విమర్శలు గుప్పించారు.

Google News Follow Us

పాలేరు:బీఆర్ఎస్ కు తుమ్మల నాగేశ్వరరావు అన్యాయం చేశారా... తుమ్మల నాగేశ్వరరావు   బీఆర్ఎస్ కు అన్యాయం చేశారో చెప్పాలని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రజలను కోరారు.ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పాలేరులో శుక్రవారంనాడు నిర్వహించిన  బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో  తెలంగాణ సీఎం కేసీఆర్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు.

పువ్వాడ అజయ్ చేతిలో  ఓటమి పాలై  తుమ్మల నాగేశ్వరరావు  కూర్చుంటే తానే బీఆర్ఎస్ లోకి ఆహ్వానించినట్టుగా  చెప్పారు.  ఎమ్మెల్సీని ఇచ్చి  కేబినెట్ లోకి తీసుకున్నట్టుగా కేసీఆర్ గుర్తు చేశారు.  పాలేరు ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకట్ రెడ్డి  మరణిస్తే  జరిగిన ఉప ఎన్నికల్లో తుమ్మల నాగేశ్వరరావును గెలిపించుకున్నామన్నారు. ఐదేళ్ల పాటు  ఖమ్మం జిల్లాను తుమ్మల నాగేశ్వరరావుకు అప్పగిస్తే  ఏం చేశారని ఆయన  ప్రశ్నించారు. ఐదేళ్లు తుమ్మల నాగేశ్వరరావుకు అప్పగిస్తే  గుండు సున్నా  ఇచ్చారన్నారు.

 తనకు బీఆర్ఎస్ అన్యాయం చేసిందని  తుమ్మల నాగేశ్వరరావు  ప్రచారం చేస్తున్నారని ఆయన  మండిపడ్డారు. పూటకో పార్టీ మారే వాళ్లను నమ్మి ఓటు వేయవద్దని తెలంగాణ సీఎం కేసీఆర్  ప్రజలను కోరారు. అవకాశాల కోసం పార్టీలు మారే వారిని నమ్మి ఓటు వేయవద్దని ఆయన సూచించారు.అవకాశాల కోసం పార్టీలు మారే వారిని నమ్మి ఓటు వేయవద్దన్నారు. డబ్బు కట్టల అహంకారంతో వచ్చే వారికి అవకాశం ఇవ్వవద్దని  కేసీఆర్ కోరారు.పదవుల కోసం పార్టీలు మారే వారు మన మధ్యలోనే ఉన్నారని చెప్పారు. డబ్బు కట్టలతో ప్రజలను కొంటామనుకునే వారికి బుద్ది చెప్పాలని కేసీఆర్ కోరారు.

24 ఏళ్ల క్రితం పిడికెడు మందితో  తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించినట్టుగా ఆయన చెప్పారు. అప్పుడు చాలా మంది అవమానించారన్నారు.  కాంగ్రెస్ మోసం చేస్తే  కేసీఆర్ శవయాత్రనా, జైత్రయాత్రనా అని దీక్ష మొదలు పెట్టినట్టుగా  కేసీఆర్ గుర్తు చేశారు.తాను దీక్ష చేస్తే అరెస్ట్ చేసి ఖమ్మం జైల్లో పెట్టారని ఆయన గుర్తు చేశారు. తాను తెలంగాణ ఉద్యమం ప్రారంభించిన సమయంలో తనను అనేక మంది అవమానించారన్నారు.

ప్రజలకు మంచినీళ్లు ఇవ్వాలన్న ఆలోచన కూడ గతంలో పాలించిన పార్టీలకు లేదన్నారు. గతంలో భూముల ధరలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయని కేసీఆర్ ప్రశ్నించారు.భక్త రామదాసు ప్రాజెక్టుతో  ఎకరం రూ. 4 లక్షలున్న భూమి ధర ఇవాళ రూ. 40 లక్షలకు పెరిగిందని కేసీఆర్ గుర్తు చేశారు. పార్టీల వైఖరిని పరిశీలించి ఓట్లు వేయాలని ఆయన  ప్రజలను కోరారు.

also read:తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు : ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ దూకుడు, ప్రతి మూలలోనూ ప్రచారం కంప్లీట్

రైతు బంధును పుట్టించింది కేసీఆర్ అని ఆయన చెప్పారు.రాష్ట్ర సంపద పెరుగుతున్నా కొద్ది సంక్షేమ పథకాలు పెంచుతున్నామన్నారు.గతంలో  ఏ పాలకులు కూడ రైతులకు ఒక్క రూపాయి ఇవ్వలేదని  కేసీఆర్ చెప్పారు.రైతుబంధు ఉండాలో వద్దో ప్రజలు నిర్ణయించుకోవాలని కేసీఆర్  ప్రజలను కోరారు.రైతు బంధు వద్దు, వ్యవసాయానికి  మూడు గంటల విద్యుత్ సరిపోతుందనే కాంగ్రెస్ ను ఓడించాలని ఆయన  ప్రజలను కోరారు. కాంగ్రెస్ గెలిస్తే  రైతుబంధుకు రాం రాం.. దళితబంధుకు జై భీమ్ అంటారన్నారు.