మూడు గంటల విద్యుతంటే రైతులే తిడుతున్నారు: 24 గంటల విద్యుత్ పై కాంగ్రెస్ కు కేసీఆర్ కౌంటర్

By narsimha lode  |  First Published Jul 24, 2023, 8:32 PM IST

తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయానికి  24 గంటలపాటు విద్యుత్ ను ఇవ్వడం లేదని  కాంగ్రెస్ చేస్తున్న ప్రచారానికి సీఎం కేసీఆర్ కౌంటర్ ఇచ్చారు.


హైదరాబాద్:  రాష్ట్రంలో  24 గంటల పాటు వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ ను  ఉచితంగా అందిస్తున్నామని  తెలంగాణ సీఎం కేసీఆర్  చెప్పారు.ఏపీలో ఇప్పుడు పరిస్థితి ఆగమైపోయిందని ఆయన ఎద్దేవా చేశారు.

యాదాద్రి భువనగిరి  డీసీసీ  అధ్యక్షుడు అనిల్ కుమార్ రెడ్డి  సోమవారంనాడు బీఆర్ఎస్ లో  చేరారు.  ఇవాళ  ప్రగతి భవన్ లో  సీఎం  కేసీఆర్ సమక్షంలో  అనిల్ రెడ్డి  బీఆర్ఎస్ లో  చేరారు.  ఈ సందర్భంగా  కేసీఆర్ ప్రసంగించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 24 గంటల పాటు రైతులకు ఉచితంగా విద్యుత్ అందిస్తున్నామన్నారు. వ్యవసాయానికి మూడు గంటల పాటు విద్యుత్  సరఫరా అవుతుందని  ప్రచారంపై  రైతులే తిడుతున్నారని  సీఎం కేసీఆర్ పరోక్షంగా కాంగ్రెస్ పై  విమర్శలు   చేశారు.24 గంటల పాటు విద్యుత్ ను అందిస్తే  రైతులు తమ వెసులుబాటు ఉన్నసమయంలో వాడుకుంటారని  కేసీఆర్ చెప్పారు.రైతులకు  ఈ స్థాయిలో విద్యుత్ ఇవ్వాలంటే దిల్లుండాలన్నారు. రైతుల వద్దకు వచ్చి విద్యుత్ బిల్లులు అడిగే సాహసం చేసేవారున్నారా అని ఆయన ప్రశ్నించారు.

Latest Videos

undefined


రాష్ట్రంలో వ్యవసాయరంగం అద్భుతంగా ఉందని కేసీఆర్ చెప్పారు. భూముల విలువ కూడ పెరిగిందన్నారు. రూ. 80 వేల కోట్లతో  కాళేశ్వరం ప్రాజెక్టు  నిర్మిస్తే  దాని అప్పు ఎప్పుడో తీరిపోయిందని  సీఎం  కేసీఆర్ చెప్పారు.  రాష్ట్రంలో  మూడు పంటలు పండుతున్నాయి.  రోడ్డుకు ఇరువైపులా ధాన్యం రాశులే  కన్పిస్తున్నాయన్నారు.  రాష్ట్రంలోని రైసు మిల్లులన్నీ  ధాన్యం రాశులతో నిండిపోయాయన్నారు. తెలంగాణ రైతులు పండించిన పంట సాగు చూసి గుండె ఉప్పొంగుతుందని  కేసీఆర్  చెప్పారు. 

 ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత  రైతులకు  ప్రయోజనం నెలకొందన్నారు.ధరణి వచ్చాక అద్బుత ఫలితాలు వస్తున్నాయన్నారు. ధరణి పోర్టల్ తెచ్చి భూములను డిజిటలైజేషన్ చేసినట్టుగా కేసీఆర్ తెలిపారు. 

  అయితే  ధరణితో రైతుల భూముల  సేఫ్ అని  ఆయన చెప్పారు.ధరణిలో  భూమి  చేరిందంటే  ఎవరూ కూడ  మార్చలేరన్నారు. మీ భూమి హక్కు నీ బొటన వేలితో మాత్రమే మార్చేలా  తీసుకువచ్చామని సీఎం కేసీఆర్ వివరించారు. ధరణి ద్వారా రైతుల ఖాతాల్లో రైతు బంధు నిధులు జమ అవుతున్నాయన్నారు.ధరణిని ఎత్తివేస్తే  రైతు బంధు నిధులు ఎలా జమ చేస్తారని  సీఎం కేసీఆర్ ప్రశ్నించారు తమ ప్రభుత్వ విధానాలతో.తలసరి ఆదాయంలో దేశంలోనే ప్రథమ స్థానంలో ఉన్నామని  ఆయన  తెలిపారు. 


బస్వాపూర్ రిజర్వాయర్ ద్వారా   భువనగిరి,ఆలేరు  నియోజకవర్గాల్లో శాశ్వతంగా  కరువు నుండి  దూరం కానున్నాయని  సీఎం తెలిపారు.   అనిల్ కుమార్ రెడ్డితో కలిసి  పనిచేయాలని  భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డికి సూచించారు  సీఎం కేసీఆర్. బీఆర్ఎస్ లో చేరిన అనిల్ కుమార్ రెడ్డికి పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని  ఆయన  హామీ ఇచ్చారు. గతంలో  నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో  నోముల భగత్ కు  టికెట్టు ఇచ్చిన సమయంలో కోటిరెడ్డికి ఎమ్మెల్సీ ఇస్తామని  ఇచ్చిన హామీని నెరవేర్చిన విషయాన్ని కేసీఆర్ గుర్తు  చేశారు.

tags
click me!