రాహుల్ గాంధీ ఎదగాలి, స్క్రిప్ట్ చదువుతున్నాడు: కేసీఆర్

By narsimha lodeFirst Published Aug 13, 2018, 8:09 PM IST
Highlights

కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ పరిణతి చెందిన  నాయకుడిగా మాట్లాడాలని  తెలంగాణ సీఎం కేసీఆర్  సూచించారు. ఎవరో రాసిచ్చింది చదవడం కంటే తెలుసుకొని మాట్లాడాలని కేసీఆర్ సూచించారు.

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ పరిణతి చెందిన  నాయకుడిగా మాట్లాడాలని  తెలంగాణ సీఎం కేసీఆర్  సూచించారు. ఎవరో రాసిచ్చింది చదవడం కంటే తెలుసుకొని మాట్లాడాలని కేసీఆర్ సూచించారు.

టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ముగిసిన తర్వాత టీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. డబుల్ బెడ్ రూమ్  ఇళ్ల గురించి , ఉపాధి కల్పన గురించి  రాహుల్ గాంధీ తప్పుడు మాటలు మాట్లాడారని ఆయన గుర్తు చేశారు. 

తెలంగాణలో కుటుంబపాలన గురించి రాహుల్ గాంధీ మాట్లాడడం హస్యాస్పదంగా ఉందన్నారు.  ఢిల్లీలో సాగే కుటుంబపాలన కంటే   మా కుటుంబ పాలన మేలని ఆయన చెప్పారు.  సరైన పరిణతి లేకుండా  ఏది పడితే  అది మాట్లాడితే  గౌరవం పోతోందన్నారు.  తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్న రాష్ట్రం మిగులు  రాష్ట్రం గా ఉందని తప్పుడు  ప్రచారం చేస్తున్నారని చెప్పారు.

రాహుల్‌కు మేం  భయపడుతామా అని ఆయన ప్రశ్నించారు నేనా రాహుల్ కు భయపడేదా  ఆయన చెప్పారు. ఢిల్లీకి బానిసలుగా ఉండడానికి తెలంగాణ ప్రజలు సిద్దంగా లేరని చెప్పారు. 

తాము  అనేక సర్వేలు నిర్వహిస్తే  వందకు పైగా  సీట్లు తమకు వస్తాయని సర్వే నివేదికలు వచ్చాయని  ఆయన చెప్పారు.  వచ్చే ఎన్నికల్లో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తోందన్నారు. 


టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గంలో తొమ్మిది తీర్మానాలు చేసినట్టు  తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పారు. కాలేశ్వరం ప్రాజెక్టుకు 20 వేల కోట్లప్రకటించాలని  తీర్మానం చేశారు. విభజన చట్టంలోని ఇచ్చిన హమీలను అమలు చేయాలని  ఆయన చెప్పారు. 

వరి, మొక్కజొన్న లాంటి పంటలకు రూ.2 వేల మద్దతు ధర ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ మేరకు ఈ తీర్మానాన్ని తమ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో తీర్మానం చేసినట్టు చెప్పారు.

50 శాతం ఉన్న జనాభా ఉన్న బీసీలకు ఒక మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయాలని  ఆయన డిమాండ్ చేశారు.  ఈ మేరకు తమ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో తీర్మానం చేసినట్టు చెప్పారు.  బీసీలకు, మహిళలకు  చట్టసభల్లో  రిజర్వేషన్లు కల్పించాలని  తీర్మానం చేసినట్టు చెప్పారు.

విలీన ప్రక్రియను  సంపూర్ణం చేయాలని  ఆయన చెప్పారు. రాష్ట్రాలను మున్సిపాలిటీలుగా మారుస్తున్నారని  తాను నీతి ఆయోగ్  సమావేశంలో తాను ప్రస్తావించినట్టు చెప్పారు.

గత ప్రభుత్వాల మాదిరిగానే ఎన్డీఏ  పాలన సాగిస్తోందన్నారు. నీతిఆయోగ్ వల్ల పెద్దగా ఉపయోగం లేదన్నారు. దేశ, రాష్ట్ర రాజకీయాలపై ఈ సమావేశంలో చర్చించినట్టు తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పారు.  మంత్రివర్గ విస్తరణ చేయనని చెప్పారు.  40 సీట్లలో అభ్యర్థులను  మార్చబోమని చెప్పారు.

వచ్చే ఎన్నికల్లో  ఎవరితోనూ పొత్తు పెట్టుకోబోమని కేసీఆర్ ప్రకటించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ కార్యక్రమాలు చేశామో  చెప్పేందుకు ప్రగతి నివేదన సభను నిర్వహించాలని నిర్వహించాలని నిర్ణయం తీసుకొన్నట్టు చెప్పారు.

ఎన్నికల్లో  అభ్యర్థుల ఎంపిక కోసం పార్టీ అధ్యక్షుడికి  పూర్తి అధికారాలను ఇచ్చిందని  ఆయన ప్రకటించారు.  పార్టీ ప్రధాన కార్యదర్శులు జిల్లాల్లో పర్యటనలు నిర్వహించి పార్టీ స్థితిగతులపై  నివేదికలు ఇవ్వాలని  ఆదేశాలు జారీ చేసినట్టు కేసీఆర్ ప్రకటించారు.

 

ఈ వార్త చదవండి

సెప్టెంబర్‌లో అభ్యర్థుల ప్రకటన: కేసీఆర్

 

click me!