ఎమ్మెల్సీ కవితను  పార్టీ మారాలని అడిగారు:టీఆర్ఎల్పీ సమావేశంలో కేసీఆర్ సంచలనం

By narsimha lode  |  First Published Nov 15, 2022, 5:03 PM IST


టీఆర్ఎస్ఎల్పీ ,టీఆర్ఎస్ రాష్ట్రకార్యవర్గ సంయుక్తసమావేశం మంగళవారంనాడు తెలంగాణ భవన్ లో జరిగింది.ఈ సమావేశంలో  పలు కీలక అంశాలపై చర్చించారు కేసీఆర్.పార్టీ నాయకులకు కేసీఆర్ దిశా నిర్ధేశం చేశారు.
 


 

హైదరాబాద్:షెడ్యూల్ ప్రకారంగానే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని తెలంగాణ సీఎం  కేసీఆర్ చెప్పారు. పార్టీ మారాలని ఒత్తిళ్లు చేస్తున్నవిషయాన్నికేసీఆర్ సమావేశంలో ప్రస్తావించారు.తన కూతురు,ఎమ్మెల్సీ కవితను కూడా పార్టీ మారాలని అడిగారని కేసీఆర్ ఈ సమావేశంలో చెప్పారు.మంగళవారంనాడు తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ఎల్పీ ,టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గసమావేశం జరిగింది.ఈ సమావేశంలో కేసీఆర్ పార్టీ నాయకులకు దిశానిర్ధేశం చేశారు. రాష్ట్రంలో ముందస్తు  ఎన్నికలకు అవకాశం లేదని కేసీఆర్ తేల్చి చెప్పారు.తన కూతురిని కూడ బీజేపీలో చేరాలని అడిగారని పార్టీ సమావేశంలో కేసీఆర్ చెప్పారు..ఇంతకంటే ఘోరం ఉంటుందా అని ఆయన ప్రశ్నించారు. తన కూతురిని కూడా బీజేపీలో  చేరాలని ఒత్తిడి తెస్తున్నారన్నారు.బీజేపీపై పోరాటం చేయాల్సిందేనని కేసీఆర్ చెప్పారు. కేంద్రానికి అనుకూలంగా జగన్ ఉన్నా బీజేపీ జగన్ ను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తుందన్నారు సీఎం కేసీఆర్ .ఇంత కంటే అన్యాయం మరోటి ఉంటుందా అని కేసీఆర్ ప్రశ్నించారు.

Latest Videos

ఈడీ దాడులను పార్టీ నేతలు ఉపేక్షించవద్దని కేసీఆర్ సూచించారు.ఎక్కడైతే కేంద్ర సంస్థలు దాడులు చేస్తే అక్కడే ధర్నాలుచేయాలని కేసీఆర్ సూచించారు. ఎన్నికలకు పదిమాసాల సమయం ఉందని కేసీఆర్ పార్టీ నేతలకు చెప్పారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చే ప్రసక్తే లేదని కేసీఆర్ తేల్చి చెప్పారు.

వచ్చే ఎన్నికలకు నేతలంతా సన్నద్దం కావాలని  కేసీఆర్ సూచించారు.ప్రజలతో గ్యాప్ లేకుండా చూసుకోవాలని కేసీఆర్ పార్టీ నేతలను కోరారు.ఎన్నికలకు సమయం తక్కువగా ఉన్నందున పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని సీఎం కోరారు.ప్రతి నిత్యం నియోజకవర్గ ప్రజలతో సంబంధాలు కొనసాగించాలన్నారు. 

also read:తెలంగాణ భవన్ లో ప్రారంభమైన టీఆర్ఎస్‌ఎల్పీ, రాష్ట్ర కార్యవర్గం:కీలకాంశాలపై చర్చ

ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి సీనియర్ నేతలను ఇంచార్జీగా నియమించనున్నట్టుగా కేసీఆర్ తెలిపారు.కేంద్ర దర్యాప్తు సంస్థలు రాష్ట్రంలో ఇటీవల కాలంలో  చేసిన సోదాలకు సంబంధించిన అంశాలను కూడా కేసీఆర్ ప్రస్తావించారు.దర్యాప్తు సంస్థలు సోదాలు చేసిన ప్రాంతాల్లో  ధర్నాలు చేయాలని పార్టీ నేతలకు సూచించారు.వచ్చే ఎన్నికల్లో ఎలా గెలవాలనే అంశంపైనే దృష్టి కేంద్రీకరించాలని కేసీఆర్  పార్టీ నేతలను కోరారు.

అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు సాధించేందుకు అనుసరించాల్సిన వ్యహంపై పార్టీ నేతలకు కేసీఆర్ దిశానిర్ధేశం చేశారు.మరోవైపు బీఆర్ఎస్ కు చెందిన కమిటీల ఏర్పాటుపై కసరత్తు చేస్తున్నామని కేసీఆర్ చెప్పారు.జిల్లాకు చెందిన మంత్రులతో అభివృద్దిపై ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేలు టచ్ లో ఉండాలని  సీఎం ఎమ్మెల్యేలకు చెప్పారు.
 

click me!