వ్యక్తిగతంగా మంచి మిత్రుడిని కోల్పోయా: కృష్ణ పార్థీవదేహనికి తెలంగాణ సీఎం కేసీఆర్ నివాళి

By narsimha lodeFirst Published Nov 15, 2022, 2:39 PM IST
Highlights

హీరో కృష్ణ పార్థీవదేహనికి  తెలంగాణ సీఎం కేసీఆర్ నివాళులర్పించారు. వ్యక్తిగతంగా తానుమంచి మిత్రుడిని కోల్పోయినట్టుగా కేసీఆర్ చెప్పారు.


హైదరాబాద్:హీరో కృష్ణ మరణంతో తాను వ్యక్తిగతంగా మంచి మిత్రుడిని కోల్పోయాయననితెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పారు.టాలీవుడ్ హీరో కృష్ణ పార్థీవ దేహనికి తెలంగాణ సీఎం కేసీఆర్ మంగళవారంనాడు నివాళులర్పించారు.. హీరో కృష్ణ పార్థీవ దేహంపై పూలమాల వేసి కేసీఆర్ నివాళులర్పించారు. కృష్ణ  మరణానికి దారి తీసిన పరిస్థితులను కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు. హీరో మహేష్ బాబును హత్తుకుని కేసీఆర్ ఓదార్చారు.మహేష్ బాబు కుటుంబసభ్యులకుకేసీఆర్ సానుభూతిని తెలిపారు.అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు.పలుసార్లు కృష్ణ ఆహ్వానం మేరకుతాను ఇక్కడికి వచ్చిన విషయాన్నికేసీఆర్ గుర్తు చేసుకున్నారు.విజయ నిర్మల మరణించిన సమయంలో కూడా తాను ఇక్కడికి   వచ్చినట్టుగా కేసీఆర్ గుర్తు చేసుకున్నారు.

ముక్కుసూటిగా మాట్లాడే  నైజం కృష్ణదన్నారు.ఎంపీగా కూడా కృష్ణ పని చేసి ప్రజలకు సేవ చేశారని కేసీఆర్  చెప్పారు. అల్లూరి సీతారామరాజు సినిమాను తాను చాలాసార్లు చూసినట్టుగా కృష్ణకు చెబితే నవ్వారన్నారు. మీరు కూడా సినిమాలుచూస్తారా అని తనను కృష్ణ అడిగారన్నారు. దేశభక్తిని ప్రోత్సహించేలా అల్లూరి సీతారామరాజు సినిమా ఉందన్నారు.మహేష్ బాబు సహా ఇతర కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పినట్టుగాకేసీఆర్ తెలిపారు. కృష్ణ అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని  ఆదేశించిన విషయాన్ని కేసీఆర్ తెలిపారు. 

గుండెపోటు రావడంతో హీరో కృష్ణను నిన్న తెల్లవారుజామున కుటుంబసభ్యులు హైద్రాబాద్ కాాంటినెంట్ ఆసుపత్రికి తరలించారు.ఆసుపత్రిలో చికిత్సపొందుతూ కృష్ణ ఇవాళ తెల్లవారుజామున మరణించారు.గుండెపోటు కారణంగా శరీరంలో పలు అవయవాలు దెబ్బతిన్నాయి. చికిత్సకు ఆయన శరీరం సహకరించలేదని వైద్యులు చెప్పారు. ఇవాళ ఉదయం కాంటినెంటల్ ఆసుపత్రి నుండి కృష్ణ పార్థీవదేహన్ని కుటుంబసభ్యులు నానక్ రామ్ గూడలోని ఆయన నివాసానికి తరలించారు.
 

click me!