టాలీవుడ్ జేమ్స్ బాండ్: హీరో కృష్ణ పార్థీవ దేహనికి నివాళుర్పించిన చంద్రబాబు

By narsimha lode  |  First Published Nov 15, 2022, 2:17 PM IST

టాలీవుడ్ జేమ్స్  బాండ్ గాహీరో కృష్ణ పేరుతెచ్చుకున్నారని టీడీపీ చీఫ్ చంద్రబాబు చెప్పారు.ఇవాళ కృష్ణ పార్థీవ దేహనికి చంద్రబాబు నివాళులర్పించారు..మహేష్ బాబు కుటుంబ సభ్యులను చంద్రబాబు ఓదార్చారు.



హైదరాబాద్:హీరో కృష్ణ ఏం చేసినా ధైర్యంగా చేసేవారని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు చెప్పారు.44 ఏళ్ల  పాటు సినీ పరిశ్రమలో హీరో  కృష్ణ అనేక  కీలక మలుపులకు కారణమన్నారు.మంగళవారంనాడు నానక్ రామ్ గూడలోని నివాసంలో హీరో కృష్ణ పార్థీవదేహనికి చంద్రబాబునివాళులర్పించారు.హీరో మహేష్ బాబును చంద్రబాబు ఓదార్చారు.కృష్ణ మరణానికి దారితీసిన పరిస్థితులను కుటుంబసభ్యులను అడిగి తెలుసుకున్నారు చంద్రబాబు.అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. హీరో  కృష్ణ మరణం తనను దిగ్బ్రాంతికి గురిచేసిందన్నారు.

ఈ విషయం తెలిసి తాను చాలా బాధపడినట్టుగా ఆయన చెప్పారు.టాలీవుడ్ జేమ్స్ బాండ్ గా కృష్ణ పేరు తెచ్చుకున్నారన్నారు. తాను విద్యార్థిగా ఉన్న సమయంలో కృష్ణ నటించిన తేనే మనసులు సినిమా చూసినట్టుగా చంద్రబాబు చెప్పారు.తేనే మనసులు సినిమా తర్వాత కృష్ణ తిరుపతి వచ్చిన సమయంలో తాను విద్యార్ధిగా కృష్ణను చూసేందుకు వెళ్లిన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కృష్ణ లెజెండ్ నటుడని ఆయన చెప్పారు.340 సినిమాల్లో నటిచడమంటే సాధారణ విషయం కాదని చంద్రబాబు చెప్పారు.నటుడిగా,నిర్మాతగా అనేక మంచి సినిమాలకు కృష్ణ  కారణమయ్యారన్నారు.

Latest Videos

undefined

అల్లూరి సీతారామరాజు వంటి  సినిమా ఆయనకే దక్కిందన్నారు.రాత్రి,పగలు అనే తేడా లేకుండా సినిమాల్లో కృష్ణ నటించారన్నారు.పసమాజ సేవ చేసేందుకు కృష్ణ రాజకీయాల్లోకి వచ్చారన్నారు.రాజకీయాల్లో కూడా కృష్ణ రాణించారని ఆయన ప్రస్తావించారు. భావితరాలకు కృష్ణ ఆదర్శమన్నారు.కృష్ణకు ఎక్కువ అభిమాన సంఘాలున్న విషయాన్ని చంద్రబాబు చెప్పారు.మహేష్ బాబు కుటుంబంలో ఒకే ఏడాదిలో ముగ్గురు మృతి చెందడం అత్యంత బాధాకరమన్నారు.కృష్ణ లెగసీని ముందుకు తీసుకెళ్లాలని మహేష్ బాబును కోరారు. మహేష్ బాబు కుటుంబ సభ్యులకు చంద్రబాబు సానుభూతి తెలిపారు.

గుండెపోటు రావడంతో హీరో కృష్ణను నిన్న తెల్లవారుజామున కుటుంబసభ్యులు హైద్రాబాద్ కాాంటినెంట్ ఆసుపత్రికి తరలించారు.ఆసుపత్రిలో చికిత్సపొందుతూ కృష్ణ ఇవాళ తెల్లవారుజామున మరణించారు.గుండెపోటు కారణంగా శరీరంలో పలు అవయవాలు దెబ్బతిన్నాయి. చికిత్సకు ఆయన శరీరం సహకరించలేదని వైద్యులు చెప్పారు. ఇవాళ ఉదయం కాంటినెంటల్ ఆసుపత్రి నుండి కృష్ణ పార్థీవదేహన్ని కుటుంబసభ్యులు నానక్ రామ్ గూడలోని ఆయన నివాసానికి తరలించారు.
 

click me!