ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదివారంనాడు పట్టు వస్త్రాలు సమర్పించారు. సికింద్రాబాద్ ఆలయంలో సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులు ఇవాళ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదివారంనాడు ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఇవాళ మధ్యాహ్నం సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికి వచ్చారు. ఉజ్జయిని అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.
సీఎం కేసీఆర్ కు మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్ లు ఘనంగా స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు సీఎం కేసీఆర్.ఇవాళ తెల్లవారుజామున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సభ్యులు అమ్మవారికి తొలి బోనం సమర్పించారు.
అనంతరం అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతించారు. ఉజ్జయిని అమ్మవారి బోనాలను పురస్కరించుకొని బోనాలు సమర్పించేందుకు భారీగా భక్తులు ఆలయానికి చేరుకున్నారు. అదేవిధంగా పలు రాజకీయ పార్టీల నేతలు కూడ అమ్మవారి దర్శనం కోసం భారీగా వస్తున్నారు. దీంతో సామాన్య భక్తులు అమ్మవారి దర్శనం కోసం ఆలస్యమౌతుంది. బోనం సమర్పించే వారికి, అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు వేర్వేరుగా క్యూ లైన్లను ఏర్పాటు చేశారు.