దక్షిణాదిలో పార్టీ బలోపేతంపై బీజేపీ కీలక భేటీ: 11 రాష్ట్రాల అధ్యక్షులతో హైద్రాబాద్‌లో జేపీ నడ్డా మీటింగ్

By narsimha lode  |  First Published Jul 9, 2023, 12:31 PM IST

రానున్న ఎన్నికల్లో దక్షిణాదిలో  పార్టీని బలోపేతం చేసే విషయమై  ఆ పార్టీ నేతలకు  బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా  దిశా నిర్ధేశం  చేయనున్నారు.



హైదరాబాద్:  రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై  11 రాష్ట్రాల అధ్యక్షులతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా  ఆదివారంనాడు  హైద్రాబాద్ లో సమావేశమయ్యారు.ప్రత్యేకంగా దక్షిణాది రాష్ట్రాల్లో  రానున్న ఎన్నికల్లో ఎక్కువ సంఖ్యలో  ఎంపీ స్థానాలను దక్కించుకొనే విషయమై  ఈ సమావేశంలో  చర్చించనున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి  బీఎల్ సంతోష్ సహా  11 రాష్ట్రాల  బీజేపీ రాష్ట్రాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు ఈ సమావేశానికి హాజరయ్యారు.  రెండు తెలుగు రాష్ట్రాలకు  చెందిన బీజేపీ అధ్యక్షులు  కిషన్ రెడ్డి, పురంధేశ్వరిలు కూడ ఈ సమావేశంలో పాల్గొన్నారు. 

ఇవాళ ఉదయం  న్యూఢిల్లీ నుండి ప్రత్యేక విమానంలో జేపీ నడ్డా  బేగంపేట విమానశ్రయానికి చేరుకున్నారు.  బేగంపేట విమానాశ్రయంలో  జేపీ నడ్డాకు  తెలంగాణకు  చెందిన బీజేపీ నేతలు ఘనంగా స్వాగతం  పలికారు.  వచ్చే ఏడాదిలో లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి.  ఈ ఎన్నికల్లో  ఎక్కువ సీట్లను దక్షిణాది రాష్ట్రాల నుండి దక్కించుకోవడం కోసం  ఏ రకమైన వ్యూహంతో  ముందుకు వెళ్లాలనే దానిపై  పార్టీ నేతలకు  జేపీ నడ్డా దిశానిర్దేశం  చేస్తున్నారు. ఇటీవల జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలైంది.  దీంతో  రానున్నా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు  వచ్చే ఏడాదిలో జరిగే  పార్లమెంట్  ఎన్నికలపై   బీజేపీ నాయకత్వం ఫోకస్ పెట్టింది.

Latest Videos

undefined

ఇవాళ సాయంత్రం ఐదు గంటల వరకు  11 రాష్ట్రాల్లో రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నారు. మరో వైపు  ఈ రాష్ట్రాల్లో  మెజార్టీ ఎంపీ స్థానాలు దక్కించుకోవడానికి  ఏ రకమైన వ్యూహాంతో వెళ్లాలనే దానిపై  చర్చిస్తున్నారు.  ఈ సమావేశం ముగిసిన  తర్వాత సాయంత్రం ఐదు గంటలకు  తెలంగాణకు  చెందిన బీజేపీ నేతలతో  జేపీ నడ్డా  సమావేశం కానున్నారు.ఈ సమావేశంలో  పార్టీ నేతలతో  జేపీ నడ్డా చర్చించనున్నారు. 

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిని ఇటీవలనే మార్చారు. బండి సంజయ్ స్థానంలో కిషన్ రెడ్డికి  పార్టీ నాయకత్వం బాధ్యతలను అప్పగించింది.  అంతేకాదు తెలంగాణకు చెందిన నేతల మధ్య సమన్వయలోపంపై  కూడ  చర్చించే అవకాశం ఉంది. సంస్థాగతంగా  పార్టీని  బలోపేతం చేసే విషయమై   చర్చించనున్నారు.

click me!