శ్రీరంగనాథస్వామి ఆలయంలో కేసీఆర్ ప్రత్యేక పూజలు: పూర్ణకుంభంతో స్వాగతం

By narsimha lodeFirst Published Dec 13, 2021, 5:05 PM IST
Highlights

తెలంగాణ సీఎం కేసీఆర్ తమిళనాడులోని శ్రీరంగనాథస్వామి ఆలయంలో సోమవారం నాడు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుటుంబ సభ్యులతో కలిసి కేసీఆర్ ఇవాళ ప్రత్యేక విమానంలో శ్రీరంగనాథస్వామి ఆలయానికి చేరుకొన్నారు.

చెన్నై: తెలంగాణ సీఎం Kcr కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం నాడు తమిళనాడులోని Sri Ranganath temple ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇవాళ మధ్యాహ్నం హైద్రాబాద్ నుండి ప్రత్యేక విమానంలో  శ్రీరంగనాథస్వామి ఆలయానికి చేరుకొన్నారు. Telangana సీఎం కేసీఆర్ కు, తమిళనాడు మంత్రి అరుణ్ నెహ్రు, తిరుచ్చి కలెక్టర్ శివరాసు స్వాగతం పలికారు. ఆలయ అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు.ఆలయంలో శ్రీరంగనాథస్వామి ఆలయంలో పూజలు నిర్వహించిన తర్వాత  గజరాజు ఆశీర్వాదం తీసుకొన్నారు.శ్రీరంగనాథస్వామి ఆలయానికి తాను రెండోసారి వచ్చినట్టుగా తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పారు. డీఎంకె ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా ఇక్కడికి వచ్చినట్టుగా ఆయన తెలిపారు.

also read:తమిళనాడుకు కేసీఆర్: శ్రీరంగనాథఆలయంలో పూజలు, రేపు స్టాలిన్‌తో భేటీ

Hyderabadనుండి నేరుగా తమిళనాడులోని తిరుచిరాపల్లి విమానాశ్రయం చేరుకొన్నారు. అనంతరం రోడ్డు మార్గంలో  శ్రీరంగనాథస్వామి ఆలయానికి చేరుకొన్నారు. స్వామివారిని దర్శనం చేసుకొన్న తర్వాత  కేసీఆర్ చెన్నైకి బయలుదేరారు.  రాత్రికి అక్కడే ఆయన బస చేస్తారు. మంగళవారం నాడు తమిళనాడు సీఎం స్టాలిన్ తో ఆయన భేటీ కానున్నారు. గతంలోనే Tamilnadu సీఎం Stalin తెలంగాణ సీఎం కేసీఆర్ సహా పలు రాష్ట్రాల్లోని బీజేపీయేతర సీఎంలకు లేఖలు రాశారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను నిరసిస్తూ పోరాటానికి సన్నద్దం కావాలని స్టాలిన్ లేఖ రాశాడు. ఈ విషయాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. మరో వైపు స్టాలిన్ తరపున ఆ పార్టీ ప్రతినిధి బృందం కూడ హైద్రాబాద్ కు వచ్చి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ Ktr ను కలిసి వెళ్లారు. 

click me!