Kaleshwaram Project: కాళేశ్వరంపై కేంద్రం, తెలంగాణ ప్రభుత్వాలకు ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసులు

Published : Dec 13, 2021, 04:59 PM IST
Kaleshwaram Project: కాళేశ్వరంపై కేంద్రం, తెలంగాణ ప్రభుత్వాలకు ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసులు

సారాంశం

కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు (kaleshwaram project) సంబంధించి కేంద్రం, తెలంగాణ ప్రభుత్వాలకు జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్ఆర్సీ) నోటీసులు జారీచేసింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ ముంపు ప్రభావంపై అధ్యయనం చేయాలని NHRC కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. 

కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు (kaleshwaram project) సంబంధించి కేంద్రం, తెలంగాణ ప్రభుత్వాలకు జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్ఆర్సీ) నోటీసులు జారీచేసింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ ముంపు ప్రభావంపై అధ్యయనం చేయాలని NHRC కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఈ అధ్యయనం నివేదికను 8 వారాల్లో ఇవ్వాలని తెలిపింది. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ముంపు అధికంగా ఉందంటూ న్యాయవాది శ్రావణ్ ఎన్‌హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ వల్ల ఇటీవల 30 నుంచి 40వేల ఎకరాలు పంట నష్టం జరిగిందన్నారు. 

పంట నష్టంతో మనస్థాపం చెందిన ఓ రైతు ఆత్మహత్య చేసుకన్నట్టుగా న్యాయవాది శ్రావణ్ ఎన్‌హెచ్‌ఆర్సీ దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన ఎన్‌హెచ్‌ఆర్సీ.. గ్రీన్ ట్రైబ్యునల్ ఆదేశాలను ఎందుకు పట్టించుకోలేదంటూ ప్రశ్నించింది. కాళేశ్వరం ప్రాజెక్టు ముంపుపై పూర్తిస్థాయి అధ్యయనం చేసి ఏం చర్యలు తీసుకున్నారో నివేదికను (ఏటిఆర్) అందజేయాలని తెలంగాణ, కేంద్ర ప్రభుత్వాలకు (central government) ఆదేశాలు జారీచేసింది.
 

PREV
click me!

Recommended Stories

Telangana Panchayat Elections: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్