అమిత్ షాతో కేసీఆర్ భేటీ: కీలక అంశాలపై చర్చ

By Nagaraju penumalaFirst Published Oct 4, 2019, 3:15 PM IST
Highlights

రాష్ట్ర విభజన, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు వంటి అంశాలపై అమిత్ షాతో చర్చించారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఆంధ్రప్రదేశ్- తెలంగాణ రాష్ట్రాల మధ్య ఆస్తుల పంపకాలు వంటి అంశాలపై కూడా చర్చించారు కేసీఆర్. 

న్యూఢిల్లీ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర హోంశాఖ మంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో భేటీ అయ్యారు. పార్లమెంట్‌లోని నార్త్ బ్లాక్‌లో హోంమంత్రిత్వ శాఖ కార్యాలయంలో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. సుమారు 40 నిమిషాల పాటు రాష్ట్రంలో నెలకొన్న సమస్యలపై అమిత్ షా తో చర్చించారు సీఎం కేసీఆర్. 

రాష్ట్ర విభజన, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు వంటి అంశాలపై అమిత్ షాతో చర్చించారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఆంధ్రప్రదేశ్- తెలంగాణ రాష్ట్రాల మధ్య ఆస్తుల పంపకాలు వంటి అంశాలపై కూడా చర్చించారు కేసీఆర్. 

ఇకపోతే మరికాసేపట్లో ప్రధాని నరేంద్రమోదీతో భేటీ కానున్నారు సీఎం కేసీఆర్. గోదావరి-కృష్ణా నదుల అనుసంధానంపై కీలకంగా చర్చించనున్నారు. నదుల అనుసంధానం వల్ల తెలంగాణ, ఏపీల్లోని బీడుభూములన్నింటికీ సాగునీరు అందించే అవకాశం ఉందని తెలిపారు. 

నదుల అనుసంధానానికి సంబంధించి ఆర్థిక సహాయం అందించాలని ప్రధానిని కోరనున్నారు సీఎం కేసీఆర్. కాళేశ్వరం ప్రాజెక్టు, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులలో ఏదో ఒక దానికి జాతీయ హోదా ఇవ్వాలని ప్రధానిని కోరనున్నారు. 

రాష్ట్రంలో హైవేల విస్తరణపై కూడా చర్చించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రీజినల్ రింగ్‌రోడ్‌పై ఇప్పటికే డీపీఆర్‌ను కేంద్రానికి సమర్పించింది. కంటోన్మెంట్ ప్రాంతాల్లో రోడ్ల విస్తరణకు రక్షణశాఖకు చెందిన భూములను ఇవ్వాలని ప్రధానిని కేసీఆర్ కోరనున్నారు. 

రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటికీ మంచినీటి కోసం మిషన్ భగీరథ పథకాన్ని తీసుకువచ్చిన తర్వాతే కేంద్రం ఘర్‌ఘర్ జల్ అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. కేంద్ర పథకానికి మిషన్ భగీరథను అనుసంధానంచేయాలని సీఎం ప్రధానితో చర్చించనున్నట్లు తెలుస్తోంది. 

click me!