గెజిట్ నోటిఫికేషన్ అమలు ఇప్పుడే వద్దు: కేంద్ర మంత్రి షెకావత్‌కు కేసీఆర్ విజ్ఞప్తి

Siva Kodati |  
Published : Sep 25, 2021, 03:43 PM IST
గెజిట్ నోటిఫికేషన్ అమలు ఇప్పుడే వద్దు: కేంద్ర మంత్రి షెకావత్‌కు కేసీఆర్ విజ్ఞప్తి

సారాంశం

ఢిల్లీ పర్యటనలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు శనివారం కేంద్ర జలవనరులశాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య పలు అంశాలు చర్చకు వచ్చాయి. 

ఢిల్లీ పర్యటనలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు శనివారం కేంద్ర జలవనరులశాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య పలు అంశాలు చర్చకు వచ్చాయి. ముఖ్యంగా గెజిట్‌ నోటిఫికేషన్‌ అమలు, పొరుగు రాష్ట్రాలతో జల వివాదాలకు సంబంధించిన విషయాలను కేసీఆర్‌.. కేంద్ర మంత్రి షెకావత్‌తో చర్చించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలతో లేఖ అందించారు. గెజిట్‌ నోటిఫికేషన్‌ అమలు వాయిదా వేయాలని సీఎం మరోసారి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఐదు అంశాల కూడిన లేఖను షెకావత్‌కు అందించారు. ఉమ్మడి ప్రాజెక్టులనే బోర్డు పరిధిలో ఉంచాలని, వాటాలు తేలిన తర్వాతే బోర్డులు పని చేపట్టాలని సీఎం కేసీఆర్‌ కేంద్ర మంత్రిని కోరారు.  

PREV
Read more Articles on
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మ‌రో అద్భుతం.. రూ. 1200 కోట్ల‌తో భారీ షాపింగ్ మాల్‌. ఎక్క‌డో తెలుసా.?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?