‘గడియారాలు, బొట్టుబిల్లలు కాదు... దమ్ముంటే సిలిండర్ ధర తగ్గించాలి..’ మంత్రి హరీష్ రావు సవాల్..

By AN TeluguFirst Published Sep 25, 2021, 3:05 PM IST
Highlights

ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ రోజుల తరబడి తిరగకుండా ఇంటి మ్యుటేషన్ కాగితాలు, నల్లా, విద్యుత్ కనెక్షన్, విద్యుత్ మీటర్ మార్పు వంటి పత్రాలు మీకు అందజేశాం అని అన్నారు.

కరీంనగర్ జిల్లా, హుజూరాబాద్ (huzurabad)పట్టణంలోని ప్రతాప సాయి గార్డెన్ లో అర్హులైన లబ్ది దారులకు మ్యుటేషన్, ప్రొసీడింగ్ లు, నూతన గృహ నంబర్, యాజమాన్య మార్పిడి ఉత్తర్వులు, భూమి ఆధీనపత్రాలు, నీటి కుళాయిలు, విద్యుత్ కనెక్షన్, ఇంటి అనుమతుల పత్రాల పంపిణీ కార్యక్రమంలో మంత్రులు హరీష్ రావు(harishrao), గంగుల కమలాకర్ (gangula kamalakar), ఎస్సి కార్పోరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ రోజుల తరబడి తిరగకుండా ఇంటి మ్యుటేషన్ కాగితాలు, నల్లా, విద్యుత్ కనెక్షన్, విద్యుత్ మీటర్ మార్పు వంటి పత్రాలు మీకు అందజేశాం అని అన్నారు.

పని చేసే ప్రభుత్వం, పని చేసే నాయకుడు ఉంటే పని ఎంత వేగంగా జరుగుతుందో దీంతో అర్థమవుతుందన్నారు. కొద్దిమంది నేతలు తమ బాధలను ప్రజల బాధగా రుద్ది లాభపడుతుంటే, ముఖ్యమంత్రి కేసీఆర్, తెరాస ప్రభుత్వం ప్రజల బాధను, తమ బాధగా భావించి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోంది. కొద్ది మంది బాగా మాట్లాడుతున్నారు. పెరిగిన సిలిండర్ ధర తగ్గిస్తామని ఎందుకు చెప్పడం లేదు.

దమ్ముంటే గడియారాలు, బొట్టుబిల్లలు కాదు... వేయి రూపాయలకు పెంచిన సిలండర్ ధర తగ్గిస్తామని హుజూరాబాద్ ప్రజలకు చెప్పి ఓట్లు అడగండి. బీజేపీకి ఓటు వేస్తే...పెంచిన ధరలకు ప్రజలు మద్ధతు ఇస్తున్నారని చెప్పి సిలిండర్ ధర మూడు వేలు, మంచి నూనె ధర 300 రూపాయలకు పెంచుతారు. ఓటుకు రెండు వేలు ఈ ఒక్క రోజు చేతిలో పెట్టి, రేపటి నుండి సిలండర్ ధర మూడు వేలకు పెంచి మన వద్ద నుండి వసూలు చేస్తారు. బొట్టుబిళ్లలు, గడియారాలకు మోసపోవద్దు అన్నారు.

పని చేసే ప్రభుత్వాన్ని గెలిపించండి. తెరాస ప్రభుత్వం ప్రజల బాధలను తమ బాధలుగా భావించే వృద్దులకు ఆసరా, పేదింటి ఆడపిల్లల పెళ్లికి లక్ష రూపాయల కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్ వంటి పథకాలు ఇస్తోంది. మొన్న వరద వస్తే ఇంటికి 3800 రూపాయలు సాయం అందించాం. డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టుకోవడానికి డబ్బులు ఇచ్చేది తెరాస ప్రభుత్వం కాదా అన్నారు. 

మాయమాటలు చేప్పే వారివైపు ఉంటారా? న్యాయం , ధర్మం వైపు ఉంటారా? తన బాధను ప్రజల మీద రుద్ది ఓ పెద్దమనిషి లబ్ధి పొందాలనుకుంటున్నారు. హుజూరబాద్ సంక్షేమం, అబివృద్ధి ఆగవద్దంటే, తెరాస ప్రభుత్వాన్ని బలపర్చాలని అన్నారు.

మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. ఇవాళ దసరా పండుగా ముందే వచ్చింది.నలభై ఏళ్లు, దరఖాస్తు ఇచ్చాం... దండం పెట్టాం. నలభై ఏళ్ల నుంచి ఉంటున్నాం. ఇంటి పట్టా ఇవ్వండన్నాం. కరెంటు పెట్టమన్నాం. నల్లా కనెక్షన్ ఇవ్వమన్నాం. కానీ ఇవ్వలేదు.450 మంది నలభై ఏళ్లు ఇబ్బందులు ఎదుర్కునారు. కాని మంత్రి హరీశ్ రావు గారి నేతృత్వంలో ఇంటి పత్రాలు పొందారు. సీఎం గారి దృష్టికి  ఈ సమస్య తీసుకెళ్లడంతో వెంటనే హరీశ్ రావు గారి చొరవతో ఈ కల సాకారమయిందని అన్నారు.

హైదరాబాద్‌లో దారుణం.. గుట్కాలు తింటోందని గొంతుపై కాలితో తొక్కి భార్యను చంపేశాడు..

తెలంగాణ తెచ్చుకున్నది ఇందు కోసమే. తెలంగాణకు ముందు కాంగ్రెస్, టీడీపీ వంటి ప్రభుత్వాలను చూడలేదా? ఎనాడు పేదలను పట్టించుకోలేదు... తెలంగాణ రాకముందు కరెంటు ఉండేదా? తాగు నీరు వచ్చేదా? నీళ్లు లేక నానా ఇబ్బందులు పడ్డాం. అందుకే కేసీఆర్, తెలంగాణ వచ్చుడో, కేసీఆర్ చచ్చుడో అని తెలంగాణ సాదించారు. బడుగు, బలహీన వర్గాల కోసమే తెలంగాణ సాధించుకున్నాం.

ఇక మీ ఇంటిపై సర్వహక్కులు మీవే. 72 మంది కళ్యాణ ల క్ష్మి చెక్కులు ఇస్తున్నాం. ఇప్పుడు. గతంలో బిడ్డ పెళ్లి అంటే చాలా కష్టపడాల్సి వచ్చేది. మేనమామ గా సీఎం కేసీఆర్ లక్ష నూట పదహార్లు ఇస్తున్నారు. దేశంలో ఎన్నో రాష్ట్రాలున్నాయి. మోడీ పాలించిన రాష్ట్రం ఉంది. యూపీ వంటి బీజేపీ పాలిత రాష్ట్రం ఉంది. ఎక్కడైనా పెదింటి ఆడపిల్లలకు కళ్యాణ లక్ష్మి ఇచ్చారా? అని ప్రశ్నించారు. 

click me!