KCR Letter to Modi: ధాన్యం కొనుగోళ్లపై ఎఫ్‌సీఐకి ఆదేశాలు ఇవ్వండి.. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీకి సీఎం కేసీఆర్ లేఖ‌

Published : Nov 17, 2021, 05:04 PM ISTUpdated : Nov 17, 2021, 05:09 PM IST
KCR Letter to Modi: ధాన్యం కొనుగోళ్లపై ఎఫ్‌సీఐకి ఆదేశాలు ఇవ్వండి..  ప్ర‌ధాని న‌రేంద్ర మోదీకి సీఎం కేసీఆర్ లేఖ‌

సారాంశం

ప్రధాని నరేంద్ర మోదీకి (Narendra Modi) తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) లేఖ రాశారు. ధాన్యం కొనుగోళ్లకు  (paddy procurement)సంబంధించి ఎఫ్‌సీఐకి (FCI) ఆదేశాలు ఇవ్వాలని కేసీఆర్ తన లేఖలో ప్రధానిని కోరారు. 

తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి టీఆర్‌ఎస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్దం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోదీకి (Narendra Modi) తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) లేఖ రాశారు. ధాన్యం కొనుగోళ్లకు  (paddy procurement)సంబంధించి ఎఫ్‌సీఐకి (FCI) ఆదేశాలు ఇవ్వాలని కేసీఆర్ తన లేఖలో ప్రధానిని కోరారు.  2020-21 ర‌బీలో మిగిలిన 5 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల ధాన్యం కొనుగోలు చేయాల‌ని విన‌తి చేశారు. 2021-22 ఖ‌రీఫ్‌లో 40 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల ధాన్యం కూడా కొనుగోలు చేయాల‌ని సీఎం ప్ర‌తిపాదించారు. పంజాబ్ త‌ర‌హాలో తెలంగాణ‌లో కూడా ధాన్యం సేక‌ర‌ణ చేప‌ట్టాల‌న్నారు.

వచ్చే యాసంగిలో తెలంగాణ రాష్ట్రంలో కేంద్రం ఎంత వరిధాన్యం కొంటుందో ముందుగానే చెప్పాలని కేసీఆర్‌ డిమాండ్‌ చేశారు. ఎఫ్‌సీఐ తీరుతో రాష్ట్రాల్లో గంద‌ర‌గోళం నెల‌కొంది. రాష్ట్రాల నుంచి సేక‌రించే మొత్తంపై ఎఫ్‌సీఐ స్ప‌ష్ట‌త ఇవ్వ‌ట్లేదని. ప్రతి ఏడాది ఉత్ప‌త్తి పెరుగుతున్నా సేక‌రించే మొత్తం పెర‌గ‌ట్లేదు అని సీఎం లేఖ‌లో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి సత్వరమే చర్యలు తీసుకోవాలని విజ్జప్తి చేశారు కేసీఆర్‌.

రేపు ఇందిరా పార్క్ వ‌ద్ద టీఆర్ఎస్‌ మ‌హాధ‌ర్నా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే… ఇందిరాపార్క్ ధ‌ర్నాలో తెలంగాణ సీఎం కేసీఆర్‌ కూడా పాల్గొన‌నున్నట్లు మంత్రి హ‌రీష్‌ రావు ప్రకటన చేశారు. రాష్ట్రానికి అన్యాయం జరిగితే అధికారంలోకి వచ్చిన మొదట్లోనే నిరసన వ్యక్తం చేశామన్నారు. పంజాబ్‌లో ధాన్యం కొను గోలు చేస్తారు.. తెలంగాణలో ఎందుకు కొనరంటూ ప్రశ్నించారు. ధాన్యం కొనుగోలు బాధ్యత నుంచి కేంద్రం తప్పుకుంటుందన్నారు.

Also read: వరి ధాన్యం కొనుగోలుకై ఈ నెల 18న ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా: కేసీఆర్

ఇక, తెలంగాణ వరి పంట సాగుపై కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టత కోరుతూ గురువారం టీఆర్‌ఎస్ పార్టీ మహాధర్నా చేపట్టనుంది. ఇందిరా పార్కు వద్ద ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటలకు ధర్నా సాగనుంది. ఈ ధర్నాలో రాష్ట్ర మంత్రులు, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జెడ్‌పీ చైర్మన్లు, రైతుబంధు సమితుల జిల్లా అధ్యక్షులు, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొంటారని కేసీఆర్ స్పష్టం చేశారు. ధర్నా అనంతరం రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌కు తమ డిమాండ్లపై వినతిపత్రం సమర్పిస్తామని చెప్పారు. 
ఇక, రేపు ఇందిరాపార్క్ వద్ద జరిగే టీఆర్‌ఎస్ ధ‌ర్నాలో తెలంగాణ సీఎం కేసీఆర్‌ కూడా పాల్గొన‌నున్నట్లు మంత్రి హ‌రీష్‌ రావు వెల్లడించారు.కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకే ఇందిరా పార్కులో రేపు మహాధర్నా నిర్వహిస్తున్నామని మంత్రి హరీష్‌రావు తెలిపారు. కేంద్రం ఇప్పటికైనా కళ్లు తెరవాలని కోరారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Hyper Aadi: సుగాలి ప్రీతికి న్యాయం జరిగిందే పవన్ కళ్యాణ్ వల్లే: హైపర్ ఆది| Asianet News Telugu
ఎన్టీఆర్ అభిమానులకి పూనకాలు తెప్పించే స్పీచ్ | CM Revanth Reddy Powerful Speech At NTR