ఏటూరు నాగారానికి హెలికాప్టర్ లో కేసీఆర్

By narsimha lode  |  First Published Jul 17, 2022, 1:35 PM IST

భద్రాచలంలో సీఎం కేసీఆర్ ముంపు బాధితులను పరామర్శించారు. భద్రాచలంలో వరద బాధితులకు శాశ్వత భవనాలు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం కేసీఆర్ భద్రాచలం నుండి హెలికాప్టర్ లో ఏటూరునాగారానికి బయలు దేరారు. 


భద్రాచలం: తెలంగాణ సీఎం KCR  హెలికాప్టర్ లో ఏటూరు నాగారానికి బయలు దేరారు. ఇవాళ ఉదయం ఏటూరు నాగారం నుండి  ప్రత్యేక బస్సులో ప్రజా ప్రతినిధులతో కలిసి కేసీఆర్ భద్రాచలం పట్టణానికి చేరుకున్నారు. 

భద్రాచలంలో పునరావాస కేంద్రంలో బాధితులతో మాట్లాడారు. ఆ తర్వాత ఐటీడీఏ కార్యాలయంలో గోదావరి వరద ముంపుపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. సమీక్ష ముగిసిన తర్వాత కేసీఆర్  హెలికాప్టర్ లో ఏటూరు నాగారం వెళ్లారు. Etur Nagaramలో వరద ఉధృతిపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించనున్నారు. 

Latest Videos

undefined

also read:భద్రాచలం ముంపు బాధితులకు శాశ్వత కాలనీలు, క్లౌడ్ బరస్ట్ అనుమానాలు: కేసీఆర్

అంతేకాకుండా ముంపు గ్రామాల ప్రజలతో కేసీఆర్ మాట్లాడనున్నారు.  శనివారం నాడు రాత్రే తెలంగాణ సీఎం కేసీఆర్ హైద్రాబాద్ నుండి వరంగల్ కు చేరుకున్నారు. ఇవాళ ఉదయం కడెం ప్రాజెక్టు నుండి భద్రాచలం వరకు సీఎం కేసీఆర్ ఏరియల్ సరవే చేయాలని భావించారు. కానీ వాతావరణం అనుకూలించని కారణంగా కేసీఆర్ ఏరియల్ సర్వేను రద్దు చేసుకున్నారు. భద్రాచలం నుండి కేసీఆర్ helicopter లో ఏటూరు నాగారం వెళ్లారు.

గోదావరికి  ఏనాడూ రాని స్థాయిలో వరద పోటెత్తింది. దీంతో గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండి ఉమ్మడి ఖమ్మం జిల్లా వరకు గోదావరి పరివాహక ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గోదావరికి వరద పోటెత్తడంతో పరివాహక ప్రాంతాలను వరద ముంచెత్తింది. భద్రాచలం వద్ద గోదావరి నది 70 అడుగులను దాటి వరద పోటెత్తింది గోదావరి. భద్రాచలం పట్టణంలోకి వరద నీరు పోటెత్తకుండా కరకట్ట అడ్డుకుంది. భద్రాచలం వద్ద గోదావరి బ్రిడ్జిపై 48 గంటల పాటు రాకపోకలు నిలిపివేశారు. 

click me!