Telangana CM KCR Delhi Tour:ఢిల్లీకి బయలుదేరిన కేసీఆర్

By narsimha lodeFirst Published Sep 24, 2021, 4:04 PM IST
Highlights

తెంంగాణ సీఎం కేసీఆర్ శుక్రవారం నాడు ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. మూడు రోజుల పాటు కేసీఆర్ ఢిల్లీలోనే ఉంటారు. ఎల్లుండి మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల సీఎంల సమావేశంలో కేసీఆర్ పాల్గొంటారు. రేపు కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్ర షెకావత్ తో కేసీఆర్ భేటీ కానున్నారు.

హైదాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ (Telangana CM KCR Delhi visit) శుక్రవారం నాడు ఢిల్లీకి (Delhi)బయలుదేరి వెళ్లారు. బేగంపేట విమానాశ్రయం నుండి కేసీఆర్ ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లారు.  మావోయిస్టు (maoist) ఎల్లుండి జరిగేత ప్రభావిత రాష్ట్రాల సీఎంల సమావేశంలో కేసీఆర్ పాల్గొంటారు.

also read:ఢిల్లీకి మరోసారి కేసీఆర్: ఈ నెల 24న హస్తిన టూర్

ఈ నెల 24వ తేదీనే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు (Telangana Assembly sessions)ల్లో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సమావేశాలు వాయిదా పడిన తర్వాత  బీఏసీ సమావేశం పాల్గొన్నారు.  ఈ సమావేశం ముగిసిన వెంటనే కేసీఆర్ అసెంబ్లీలోని తన ఛాంబర్ లో పలువురితో భేటీ అయ్యారు. పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రజాప్రతినిధులతో పలు అంశాలపై చర్చించారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు.

అసెంబ్లీ నుండి ఆయన నేరుగా ప్రగతి భవన్ కు చేరుకొన్నారు. ప్రగతి భవన్ నుండి  ఆయన బేగంపేట నుండి నేరుగా ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.  మూడు రోజుల పాటు కేసీఆర్ ఢిల్లీలోనే ఉండే అవకాశం ఉంది. కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్ర షెకావత్ ను కేసీఆర్ ఈ నెల 25వ కలిసే అవకాశం ఉంది. షెకావత్ తో పాటు పలువురు కేంద్ర మంత్రులను  కూడ కేసీఆర్ కలుస్తారని సమాచారం. రాష్ట్రానికి నిధులు ఇవ్వాలని కేంద్ర మంత్రులను కేసీఆర్ కోరనున్నారు.

click me!